హాట్ హాట్‌గా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ రెండవ రోజు (సోమవారం) ప్రారంభమైన అసెంబ్లీ.. ఈరోజుతో 7 రోజులు సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు కీలక చర్చలపై చర్చ జరిగింది. అంతేకాకుండా పలు బిల్లులకు ఆమోదం లభించింది. ఏడు రోజులు అసెంబ్లీ సమావేశాలు కొనసాగగా.. పని గంటలు 37 గంటల 44 నిమిషాలు నడిచాయి. సభలో 39 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సభ రసవత్తరంగా సాగింది. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది.
Read Also: Ujjain: ప్రాణం తీసిన ‘‘దుపట్టా’’.. మిషన్‌లో ఇరుక్కుని మహిళ మృతి..
ఈ సమావేశాల్లో సభ మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. చివరి రోజు రైతుభరోసాపై స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. అనంతరం నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. చివరి రోజు రైతు భరోసా, రైతు రుణమాఫీ, 24 గంటల కరెంటుపై ప్రతిపక్షం, ప్రభుత్వం మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. చివరలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: TG: పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు.. ఉత్తర్వులు జారీ