పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్ బృందంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అక్రమ రవాణా కేసుల దర్యాప్తు, విచారణ కోసం గతంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సిట్ బృందంలో కొందరు సభ్యుల నియామకంపై వచ్చిన అభ్యంతరాలపై సిట్‌లో మార్పులు జరిగాయి. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. గత బృందంలో ఉన్న కొంతమంది సభ్యులపై అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం మార్పులు చేసింది.
Read Also: July 2024 Movie Roundup: నెలంతా రాజ్ తరుణ్-లావణ్య పంచాయితీ.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్
సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర రావు, బీసీ సంక్షేమ శాఖ కాకినాడ ఈడీ ఏ.శ్రీనివాస రావు, మహిళా శిశు సంక్షేమశాఖ కర్నూలు ఆర్జేడీ పి.రోహిణి, విజయనగరం జిల్లా పౌర సరఫరాల అధికారి కే. మధుసూదన్ రావు, కోనసీమ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ బాల సరస్వతి సిట్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో నమోదు అయిన 13 కేసులపై సిట్ విచారణ చేయనుంది. సిట్‌లో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారులు, అలాగే పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ఉన్నారు. గతంలో నియమించిన నలుగురు డీఎస్పీలపై అభ్యంతరాల వచ్చిన నేపథ్యంలో ఇతర శాఖల అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: 2024లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్లు ఎవరంటే..? (అన్ని ఫార్మాట్లలో)