ఒంటరిగా మహిళలు కనపడితే చాలు.. అత్యాచారం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకొందరైతే మహిళలను బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడటం చూస్తున్నాం.. చూశాం. అయితే.. ఈ సంఘటన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ ఘటనతో అమ్మాయిలు లిఫ్ట్ అడిగితే బైక్ ఎక్కించుకోవడానికి యువకులు భయపడిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
Read Also: Komatireddy Venkat Reddy : నల్గొండ ప్రజల దశాబ్దాల కల SLBC
హైదరాబాద్ నగరంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇద్దరు కిలాడీ లేడీలు.. ఆ మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్‌గూడకు చెందిన వెన్నెల బంధువులు. గత కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సదరు వాహనదారుడు డబ్బులివ్వకపోతే తమపై లైంగికదాడికి యత్నించాడని కేసు పెడతామని బెదిరించి డబ్బులు లాక్కుంటున్నారు.
Read Also: PM Modi: ఈ ఏడాది సాధించిన విజయాలను ఎక్స్‌లో పోస్టు చేసిన మోడీ
నవంబర్ 6న సాయంత్రం జెన్‌కోలో పని చేస్తున్న వ్యక్తి బైక్‌పై నాగారంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. తార్నాక బస్టాండ్ వద్ద నిలుచుని ఉన్న భాగ్య అతడిని లిఫ్ట్ అడిగింది. లాలాపేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్ వద్దకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేసింది. అతను డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించగా.. తనను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి ఫోన్‌పే ద్వారా రూ. 95 వేలు బదిలీ చేయించుకుంది. అనంతరం అతడితో పాటు కుషాయిగూడకు వెళ్లి ఏటీఎం ద్వారా రూ. 55 వేలు విత్‌డ్రా చేయించి లాక్కుంది. ఈ క్రమంలో.. యువకులు జర జాగ్రత్తగా వ్యవహరించాలి.