ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో లారీ ఓ షాపులోకి దూసుకెళ్లింది. విశాఖలోని గాజవాక సుందరయ్య కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓయువతి తప్పించుకుంది. ఈ ఘటనను చూసిన స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తీవ్ర భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడున్న సీసీ వీడియోలో రికార్డు అయింది.
Read Also: Top Headlines @5PM : టాప్ న్యూస్
సీసీ ఫుటేజీ ప్రకారం.. రోడ్డుకు ఎదురుగా ఒక కిరాణా షాపు ఉంది. ఆ షాప్‌కు ఓ యువతి వచ్చింది. ఆమెకు కావాల్సిన వస్తువులు అడిగింది. ఇంతలోపు రోడ్డుపై నుంచి వేగంగా ఒక ఇసుక లారీ దూసుకువచ్చింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో.. కంట్రోల్ కాకపోవడంతో కిరాణా షాపు మీదికి దూసుకొచ్చింది. ఆ సమయంలో ఆ యువతి ముందుగానే చూసి పక్కకు తప్పుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో వెంకట రమణ అనే వ్యక్తి మృతి చెందాడు.
Read Also: Andhra tourist: గోవాలో ఏపీ టూరిస్టుని చంపిన బీచ్ షాక్ సిబ్బంది..
లారీ వచ్చే రోడ్డులో 20 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. వారు తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు కళాసికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయాలపాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.