ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలు వద్దని.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశం ఇచ్చింది. ఈ క్రమంలో.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. దీంతో.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో.. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.
Read Also: CM Chandrababu: గ్రామస్తులతో ముఖాముఖి.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ ఉండగా.. ఏ2గా గోడౌన్ మేనేజర్ మానస తేజను చేర్చారు పోలీసులు. 2016 నుంచి మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర పనిచేస్తున్నారు మానస తేజ. ఇక, పెడనకి చెందిన లారీ డ్రైవర్ మంగారావు ఉషోదయ ట్రాన్స్ పోర్ట్‌లో లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గోడౌన్ నుంచి MLS పాయింట్స్‌కి మంగారావు పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఇదే కేసులో పేర్ని నాని భార్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. ఇదే సమయంలో విచారణకు సహకరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే..
Read Also: TS Education Commission: ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలనుకోవడం సమంజసం కాదు: విద్యా కమిషన్ ఛైర్మన్