వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయం పావురాలను ఎగురవేస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఇష్యూలో ముగ్గురు వ్యక్తులపై పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గేమింగ్ యాక్ట్ బర్డ్స్ క్రుయాల్టీ యాక్ట్ లా కింద కేసు నమోదు చేశారు. 100 కిలోమీటర్లు ప్రైజ్ మనీ.. తర్వాత 200 కిలోమీటర్ల ప్రైస్ మనీ.. తర్వాత 300 కిలోమీటర్ల ప్రైస్ మనీ ఇలా బెట్టింగులకు పాల్పడుతున్నారు. పరిగి నుంచి సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామానికి సరిగ్గా 300 కిలోమీటర్లు ఉండడంతో.. ఈ పందెంలో పరిగి పట్టణాన్ని ఎంచుకొని ఇక్కడి నుంచి 300 పావురాలను వదలాలని చెప్పడంతో ముందుగా రెండు బాక్సులలోని 30 పావురాలను ఇద్దరు వ్యక్తులు విచారణలో వదిలినట్లు పోలీసులు తెలిపారు. మిగతా 250 పావురాలు బాక్సులలో ఉన్నాయని పోలీసులు చెప్పారు. కాగా.. ఇద్దరు వ్యక్తులను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు.. పావురాలను వదిలే విషయం కోర్టు నిర్ణయిస్తుందని సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Read Also: Game Changer: ఏపీలో గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెరిగాయ్.. ఎంతో తెలుసా?
40 పావురాలను ఆకాశంలోకి వదిలి పందెం పెట్టుకున్న వ్యక్తులను స్థానికులు నిలదీయగా బండారం బయటపడింది. ముందు పావురాలకు ట్రైనింగ్ ఇస్తున్నామని బుకాయించగా.. పోలీసులకు సమాచారం ఇవ్వొద్దంటూ స్థానికులతో బేరసారాలు జరిపారు. అనుమానం వచ్చి స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో రంగలోకి దిగిన పోలీసుల బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పావురాల బెట్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పావురాల బాక్సులపై కోడ్ నంబర్లు.. పావురాల కాళ్లకు కోడ్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Mumbai: ముంబైలో దారుణం.. పాఠశాల గదిలో బాలికపై టీచర్ అత్యాచారం