HYDRA: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం పరిశీలన.. హైడ్రా కీలక నిర్ణయం
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
- జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా..
- సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు
- ఫిర్యాదుల మేరకు పరిశీలించిన కమిషనర్ రంగనాథ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగనాథ్ పరిశీలించారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించారు. హైకోర్టు ఆర్డర్ ఆధారంగా గతేడాది మార్చిలో బిల్డింగ్ కొంతభాగాన్ని జీహెచ్ఎంసీ కూల్చేసింది. ఇవేవీ పట్టించుకోకుండా కొనసాగుతున్న ఈ బిల్డింగ్‌ను కూల్చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది.
Read Also: Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ సుభాష్ సూసైడ్ కేసు.. భార్య నిఖితా సింఘానియాకు బెయిల్..
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
మరోవైపు.. సోమవారం నుండి హైడ్రాలోప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇకపై ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా హైడ్రా ప్రజావాణి కొనసాగనుంది. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణల పై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వాహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుకు సంబంధిత ఆధారాలతో రావాలని హైడ్రా కమిషనర్ సూచించింది. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదుదారులకు టోకెన్స్ ఇచ్చి.. టోకెన్ ప్రకారం ఫిర్యాదులు స్వీకరిస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Read Also: Namo Namah Shivaya: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న తండేల్ ‘నమో నమశ్శివాయ’
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!