KTR TOUR: ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన ఇలా సాగింది.. రామప్పలో మత్స్యకారులతో ముచ్చటించిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR TOUR: ములుగు జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, దాని పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్ బస్టాండ్ సముదాయానికి, సేవాలాల్ భవనానికి సైతం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకొని ములుగు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.30లక్షలతో నిర్మించే డిజిటల్ లైబ్రరీ, రూ.15 లక్షలతో నిర్మించే సమాచార పౌరసంబంధాల శాఖ మీటింగ్ హాల్ పనులకు శంకుస్థాపనలు, జిల్లా కేంద్రంలో రూ.2కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
Also Read
అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పాలంపేటలో ఉండే యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. అనంతరం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా అక్కడి నుంచి రామప్ప చెరువుకు వెళ్లి బోటింగ్ చేశారు. అనంతరం చెరువులోకి వచ్చే గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ పూజలు చేశారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!