Viral Video: కోతి వేషాలంటే మాములుగా ఎట్లుంటాయో మనకు బాగా తెలుసు. కోతి చేసే విన్యాసాలు, అల్లర్లు చూడటానికి చూపరులకు అందంగా కనిపిస్తాయి. అంతేకాకుండా కోతి అల్లర్లను బట్టి మనుషులను కూడా కొందరు అంటుంటారు.. కోతిలా చాష్టలు చేస్తున్నావని. అందుకే కోతి అంటే అంతా ఫేమస్. అయితే ఇప్పుడు ఒక కోతి వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. కోతి చేసే విన్యాసాలు చూసిన జనాలు అబ్బురపోతున్నారు.
Read Also: RSS Magazine: మోడీ చరిష్మా, హిందుత్వ మాత్రమే సరిపోవు.. బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు..
మనం మాములుగా కోతి చేసే విన్యాసాలు ఏ సర్కస్ లల్లో, కోతులు ఆడించే వారి దగ్గరో చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న కోతి విన్యాసం చూస్తే మీకు ఏం గుర్తొస్తోంది.? మీరు బాహుబలి సినిమా చూశారా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ సినిమాలో హీరో ప్రభాస్ ఆవుల మందపై దూకుతూ.. చేసే ఫైట్ సీన్ గుర్తొస్తోందిగా. అచ్చంగా అలాంటి సీన్ ఇప్పుడు ఖమ్మంలో రిపీట్ అయింది. అయితే మీరనుకున్నట్లు ఏ హీరోనో కాదండి ఇప్పుడు అలాంటి సీన్లు చేసింది. ఓ కోతి..
Read Also: MLC Kavitha: తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఈ అద్భుత చిత్రం కంటపడింది. ఓ ఆటో యజమాని ఆటోలో అటు వైపు వెళ్తుండగా.. ఈ అద్భుత సీన్ కనపడటంతో వెంటనే ఆయన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. మేకల గుంపు అటుగా వెళ్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిన ఓ కోతి మేకల మందపై దూకి.. బాహుబలి స్టైల్ లో ఫీట్లు చేసింది. ఇది కదా అసలు స్టంట్ అంటూ ఆ వీడియోను వాట్సప్ లో షేర్ చేశాడు. ఆ కోతి చేసిన స్టంట్స్ కు పలువురు జనాలు రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాహుబలి 2 ఫైట్ సీన్ రిపీట్, మేకల మందపై కోతి ఫీట్లు..వీడియో వైరల్..#Bahubali2 #Prabhas #SSRajamouli #bahubali #monkey #Ashwaraopeta #viralvideo #Trending #trendingvideo #NTVTelugu pic.twitter.com/0coeJLyrKo
— NTV Telugu (@NtvTeluguLive) June 8, 2023