ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా బంపర్ డిస్కౌట్ ఆఫర్స్ ప్రకటించింది. వివిధ రకాల మోడళ్లపై గరిష్టంగా రూ.65 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది. మీరు బడ్జెట్ ధరలో మంచి కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు.
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్స్ 2023 కోసం భారత జూనియర్ జట్టును ప్రకటించింది. జూలై 7 నుండి 16 వరకు ఇండోనేషియాలోని యోగ్యకార్తాలో కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లు జరుగనున్నాయి. జట్టులో కీలకంగా ఉన్న తారా షా మరియు ఆయుష్ శెట్టి ఛాంపియన్ షిప్ లో పాల్గొననున్నారు.
ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్ డోర్‌ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్‌లతో లిఫ్ట్ మాదిరిగానే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ మెట్రో ట్రైన్‌లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది. అయితే ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ఆకతాయి యువకులు రూల్స్ ను బ్రేక్ చేశారు.
వేప కాండం నుంచి మొదలు పెడితే వేర్లు, చిగుళ్లు, విత్తనాలు వరకు ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉంటాయి. వేప చేదుగా ఉన్నా.. దానిలో మాత్రం ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. వేప అద్భుతమైన శీతలీకరణ ఏజెంట్. ఇది హైపర్ అసీడిటీ, మూత్ర మార్గ రుగ్మతలు, చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వేప ఆకులతో ఎన్నో ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు.
గింజలు, విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరు వాటిని తినడానికి దూరంగా ఉంటారు. అలా అయితే మీ శరీరంలో విటమిన్లు, ప్రొటీన్లు తగ్గినట్టే. న్యూట్రీషియన్ పవర్‌హౌస్‌గా పిలవబడే గింజలు మరియు విత్తనాలు రుచికరమైనవి, సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని అన్ని వయసుల వారు తినవచ్చు.
అజింక్యా రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే లక్కీగా రెండుసార్లు నో బాల్స్ కావడంతో.. రెండు వికెట్లు మిగిలి ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో నో బాల్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
హిందూ, ముస్లిం భాయి భాయి అన్న మాటకు అర్థం చేకూరుస్తూ ఓ ముస్లిం అమ్మాయి, ఓ హిందూ అబ్బాయి హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకున్న ఘటన ఆసక్తిరేపుతోంది. వారిద్దరూ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అంతటితో ఆగకుండా పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. ఇంకేముంది ఇద్దరు ఓకే అనుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. రూబియా అనే మహిళ.. ఓ హిందూ అబ్బాయితో పరిణయమాడింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆ జంట ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు.
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. వినూత్నంగా ఆలోచించి తన ఆటోని కారులా మార్చేశాడు. డబ్బులు ఖర్చు అయినా ఓకే కానీ.. అతని కలను నిజం చేసుకున్నాడు. అయితే ఆ ఆటో లోపల స్పెషల్ గా అచ్చం కారులా మెత్తటి సీట్లు, లైటింగ్, డోర్లు ఏర్పాటు చేయించాడు. బయటి నుంచి చూస్తే ఆటో మాదిరే ఉంటుంది. కానీ లోపల కూర్చుంటే కారులో ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది.
పొట్లకాయ, గుమ్మడి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వీటి రసాన్ని కలితాగడం వల్ల పేగుల్లోని మురికిని క్లీన్ చేస్తుంది. కిడ్నీలో రాళ్ళను పోగొడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కోహ్లీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసుకోవడం అభిమానులకు అస్సలు నిద్రపట్టడం లేదు. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్.. అతని పేలవ ప్రదర్శనతో షాక్ అయ్యారు.