Ambati Rambabu: కత్తిపూడిలో వారాహిపై తొలిసారి ప్రసంగించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటికే బహిరంగ సభ ప్రాంగణం వద్దకు వారాహి వాహనం చేరుకోగా.. కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్నారు. మరికాసేపట్లో పవన్ కల్యాణ్ అన్నవరం నుంచి కత్తిపూడి చేరుకోనున్నారు. అంతకుముందు ఉదయం అన్నవరం సత్యదేవుడి ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్.. వారాహి వాహనానికి పూజలు నిర్వహించారు.
Read Also: Earthquake: గుజరాత్‌లో భూకంపం.. దేశంలో వరసగా భూకంపాలు..
అయితే.. పవన్ వారాహి యాత్రపై అధికార వైసీపీ నేతలు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటుగా స్పందించారు. మీన మేషాలు లెక్కపెట్టుకుని వ్యాన్ తీసుకుని పవన్ బయలుదేరడం కాదు.. చంద్రబాబు డైరెక్షన్‌లో యాంటీ వైసీపీ ఓటు చీలకూడదంటున్నాడు. ఇన్నాళ్లు పవన్‌ను ఎవరైనా తిరగద్దన్నారా. మాకు అభ్యంతరమే లేదు తిరగండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ గురించి పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘చే గువేరా జన్మదిన సందర్బంగా ఒక ప్రశ్న.. టీ షర్ట్ మీద చే గువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను?’ అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
Read Also: Job Insurance: ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉద్యోగాలు లేకున్నా జీతం వస్తుంది తెలుసా?
అయితే పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై అధికార నేతలు ఘాటుగానే విమర్శిస్తుండగా.. మరి పవన్ కల్యాణ్ వారాహిపై తొలి బహిరంగ సభలో ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే కత్తిపూడిలో పవన్ కల్యాన్ సభ కోసం భారీ ఏర్పాట్లు చేయగా.. జనసైనికులు భారీగానే తరలివస్తున్నారు.