Amaravathi: బీసీ కులాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బీసీలు అంటే ఆర్.కృష్ణయ్య గుర్తొస్తారని తెలిపారు. బీసీలకు సాధికారత చేయడం ఓట్లకోసం కాదని సజ్జల అన్నారు. బీసీ సాధికారత దిశగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం పని చేసిందని పేర్కొన్నారు. బీసీలు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని.. బీసీలు పొలిటికల్ గా చోదక శక్తులు కావాలని ఆయన కోరారు. కుల, మత, డబ్బు ప్రాతిపదికన ఏ ఒక్కరి చేతులోనో అధికారం ఉండకూడదన్నారు.
Read Also: Karnataka: ఫ్రీ అంటే ఇలా ఉంటుంది.. కర్ణాటకలో “ఫ్రీ బస్” ఎఫెక్ట్.. వీడియో వైరల్..
వెనుకబడిన వర్గాలు భవిష్యత్తులో ముందుంటాయని ఆశిస్తున్నట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. రాజకీయం ఎవరో నలుగురు కూర్చుని తింటే వచ్చేది కాదని.. కార్పొరేట్ తో సమానంగా విద్య అందించడంతో బీసీ యువత కాన్ఫిడెంట్ గా ఉంటారని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో దృష్టి పెడుతున్న బీసీ యువత అందరూ.. రేపు ప్రధాన నాయకత్వంగా మారాలని సజ్జల కోరారు. అంతేకాకుండా అవకాశాలు అందుకుని సీఎం జగన్ ఆశించిన విధంగా చైతన్యవంతం కావాలన్నారు. బీసీల కార్పొరేషన్ లతో కుల సంఘాలు సమన్వయం చేసుకోవాలని.. పథకాల అమలు అందుబాటు పై క్షేత్రస్ధాయి ఆడిట్ జరగాలని సజ్జల పేర్కొన్నారు.
Read Also: Adikeshava: మెగా మేనల్లుడిని కూడా తన అందంతో బుట్టలో పడేసిందమ్మా..
మరోవైపు ఎన్నికల హీట్ మొదలవడంతో వస్తున్న కామెంట్లపై సజ్జల స్పందించారు. సెంట్రల్ మినిష్టర్లే జగన్ పాలనను పొగుడుతున్నారని తెలిపారు. కేంద్రం నుంచీ వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు విదేశాల నుంచి వచ్చినట్టు మాట్లాడుతున్నారని సజ్జల విమర్శించారు. అమిత్ షా విశాఖ టూర్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సజ్జల కౌంటర్ ఇచ్చారు. అటు పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై సెటైర్లు వేశారు. మీన మేషాలు లెక్కపెట్టుకుని వ్యాను తీసుకుని పవన్ బయలుదేరాడని తెలిపారు.