Pawan Kalyan: ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తానని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పవన్ కల్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని తనపై కక్షగట్టారని ఆరోపించారు. ప్రజల్ని బాగా చూసుకుంటానంటే వైసీపీతో తనకు ఇబ్బంది లేదన్నారు. ఒక్క సీటు కూడా లేని జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే క్లాష్‌వార్ అంటాడని.. ఎప్పుడూ నవ్వుతూ వుంటాడని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. పార్టీని నడపటానికే తాను సినిమాలు చేస్తున్నానని పవన్ తెలిపారు.
Read Also: Uttarakhand: “లవ్ జిహాద్”తో అట్టుడుకుతున్న పురోలా.. మహాపంచాయత్‌కి నిరాకరణ
తన సినిమాలు ఆపేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారని.. సినిమా టికెట్‌లపైనా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచే పనిచేస్తుందని.. ఇకపై రాజకీయాలన్ని ఏపీ నుంచే చేస్తానని స్పష్టం చేశారు. విభజన తర్వాత కూడా ఆంధ్ర నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. అయితే విడిగా రావాలో, ఉమ్మడిగా వస్తానో త్వరలోనే చెబుతానని పవన్ అన్నారు. సీఎం పదవి జనసేనకు రావాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసునని అన్నారు.
Read Also: Minister KTR : ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యంపైనే ఎక్కువ ఖర్చు అవుతుంది
సీఎం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినప్పుడు తాను చాలా సహృదయంగా మాట్లాడనన్నారు. పాలసీ పరంగా విమర్శలు చేస్తున్నానని పవన్ తెలిపారు. అయితే అధికార పార్టీ వాళ్లైతే.. నా నాలుగేళ్ల బిడ్డతో సహా అందరిని తిడతారని ఆరోపించారు. ఉచ్ఛం, నీచం లేకుండా తనను తిడుతున్నారన్నారు. ఇండియాలో అత్యంత పారితోషకం తీసుకునే వాడిలో తాను ఒకడినని.. సగటు మనిషికి ఏదో చేయాలని తపనతో రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. అణువణువునా తనపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందని.. అలా పెట్టవచ్చా అని పవన్ ప్రశ్నించారు. మీ దగ్గర గుండాలు ఉన్నారు ఏమో మా దగ్గర విప్లవ వీరులు ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.