Adimulapu Suresh: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు హఠాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుంది కదా అందుకే.. చంద్రబాబుకు అన్ని వర్గాల మీద ప్రేమ పుట్టుకు వస్తుందని దుయ్యబట్టారు. అయినా టీడీపీ నాయకులకు సిగ్గు అనిపించటం లేదని మంత్రి ఆదిమూలపు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Read Also: Ram Charan: రామ్ చరణ్- అల్లు అర్జున్ కు మధ్య విబేధాలు.. ఈ ఒక్క ఫోటోతో క్లారిటీ
చంద్రబాబు దళితుల పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని మంత్రి ఆదిమూలపు అన్నారు. టీడీపీ నేతలకు దళితులు అంటే చిన్నచూపని.. చింతమనేని ప్రభాకర్, వర్ల రామయ్య, ఆది నారాయణ, చంద్రబాబు… దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు దళితులను అసహ్యించుకుంటుంటే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నాడని తెలిపారు. జగనన్న మాదిగలకు పదవుల్లో అగ్రపీఠం, పథకాల్లో అగ్రస్ధానం ఇచ్చారన్నారు. సీఎం జగన్ డప్పు, చర్మ కళాకారుల పెన్షన్‌ను పెంచాడని తెలిపారు.
Read Also: AAA Cinemas: ‘పూజ’ పూర్తి.. ఓపెనింగ్ కి ఆల్ సెట్!
అంతేకాకుండా 2019 జనవరిలో డప్పు కళాకారులకు 1500 రూపాయలను చంద్రబాబు ఇచ్చారు.. ఎన్నికలకు మూడు నెలల ముందు 6 వేల మందికి ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. అదే 2019లో జగన్ ప్రభుత్వం మూడు వేల రూపాయలను 30 వేల మందికి ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు 56 వేల మందికి 3 వేలు ఇస్తున్న ప్రభుత్వం మాది అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దళిత సామాజిక వర్గానికి పెద్దపీఠ వేసి సాధికారత కల్పించే దిశలో అడుగులు వేసామని తెలిపారు. అందుకోసం దళితులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఒక్క అవకాశం దొరికితే.. దళిత సామాజిక వ్యక్తులకు అవకాశం కల్పించాలనే తపనతో సీఎం జగన్ ఉంటారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.