Amaravathi: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravathi: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుదల, జగనన్న భూ హక్కు- భూ రక్ష కార్యక్రమాలపై సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాంలో వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యమన్నారు. దీని ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నామని తెలిపారు. అంతేకాకుండా గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్‌కు గురైందో చెప్పాలని అధికారులను కోరారు. ఈనెల 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం జరుగనున్నట్లు సీఎం తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్షా కార్యక్రమం ఉంటుదంని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమస్యలపై జల్లెడ పడతారన్నారు. వీటి కోసం మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. సమస్యలు ఉన్న వారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అందిస్తారన్నారు సీఎం జగన్. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1న మంజూరు చేస్తారని సీఎం తెలిపారు.
Read Also: Millionaires Migration: ఇండియాను వదిలి వెళ్తున్న మిలియనీర్లు.. ఈ ఏడాది 6500 మంది వలస..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. ఇందులో 60శాతం పని దినాలు ఈ నెలాఖరులోగా పూర్తి కావాలన్నారు. ప్రతి రోజూ ప్రతి జిల్లాలో కనీసం 75 వేల పనిదినాలు కల్పించాలని సీఎం పేర్కొన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఇప్పటి వరకూ సుమారు 3.9 లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయని.. రూఫ్ లెవల్, ఆపై ఉన్నవి సుమారు 5.27లక్షలు ఉన్నాయని అధికారులకు తెలిపారు. వీటిని త్వరతగతిన పూర్తి చేసేలా చూడాలని కోరారు సీఎం జగన్. మరోవైపు ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయని.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడండని సీఎం జగన్ అధికారులను కోరారు. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే.. కలెర్టర్లను, ఎస్పీలను బాధ్యుల్ని చేస్తానన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండండని.. జులై 1 నుంచి ఇ-క్రాప్ బుకింగ్స్ ప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు. సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేసి.. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి.. కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోండని అధికారులను కోరారు.
Read Also: Sreeleela: గ్యాప్ ఇవ్వమ్మా.. శ్రీలీల.. కొంచెం గ్యాప్ ఇవ్వు
అంతేకాకుండా జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలన్నారు సీఎం జగన్. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువుల బాగోలేకున్నా.. వెంటనే సమాచారం తెప్పించుకోవాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులనుంచి ఈ సమాచారాన్ని సేకరించి వెంటనే తగిన చర్యలు తీసుకోండని అధికారులను కోరారు సీఎం. మరోవైపు నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఆరో తరగతి, ఆపైబడ్డ క్లాసులకు సంబంధించి తరగతి గదుల్లో జులై 12 కల్లా.. ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు కావాలన్నారు. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వవాలని సీఎం జగన్ సూచించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!