Farmers protest: హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత నిరసనను విరమించుకున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) డిమాండ్‌ను నెరవేర్చడానికి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు మంగళవారం తమ నిరసనను ముగించారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిన వెంటనే వారు సంబరాలు జరుపుకున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ పెద్దల సభలో ఆ రెండు ఖాళీల భర్తీ జరగదా.?
కురుక్షేత్రలో జిల్లా యంత్రాంగంతో చర్చల అనంతరం నిరసన విరమించామని బీకేయూ నాయకుడు రాకేష్ టికాయత్ తెలిపారు. అంతేకాకుండా నిరసన తెలిపిన రైతులకు పొద్దుతిరుగుడు పంటకు తగిన ధర కల్పిస్తామని హామీ ఇచ్చామని కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్ శంతను శర్మ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి పిప్లి సమీపంలోని జాతీయ రహదారి-44పై రైతులు మహాపంచాయతీ నిర్వహించి దిగ్బంధించారు. ఢిల్లీ-హర్యానా హైవేపై రైతులు నిరసన తెలిపారు. అయితే ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం రైతుల నిరసనలపై స్పందించడంతో రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also: Supreme Court: అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు విషయంలో కీలక పరిణామం..
కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మిన రైతులకు క్వింటాలుకు రూ.వెయ్యి చొప్పున పరిహారాన్ని భావంతర్ భార్‌పయ్ యోజన కింద హర్యానా ప్రభుత్వం ఇస్తున్నది. 36,414 ఎకరాల్లో సన్‌ఫ్లవర్స్ పండించిన 8,528 మంది రైతులకు రూ.29.13 కోట్ల పరిహారాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శనివారమే రిలీజ్ చేశారు. ఈ పరిహారంతో సంతృప్తి చెందని రైతులు ఆందోళన చేపట్టారు. పొద్దు తిరుగుడును ఎంఎస్పీతో క్వింటాలుకు రూ.6,400 చొప్పున కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
#WATCH | Farmers in Haryana's Kurukshetra end their protest and start celebrations after Government agrees to fulfil their demands.
Farmers were protesting over their demand for Minimum Support Price (MSP) on sunflower seeds. pic.twitter.com/FWKopOjj27
— ANI (@ANI) June 13, 2023