వేసవి కాలంలో కానీ వర్షాకాలంలో కానీ చర్మం దెబ్బతినకుండా సన్‌స్క్రీన్ అప్లై చేసుకుంటారు. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఒక రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. కానీ చాలా సార్లు చర్మంపై సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు.
శరీరంపై టాటూలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ అనుకుంటారు. అంతేకాకుండా అందరి దృష్టి వారిపైనే ఉంటుందని టాటూలు వేసుకుంటారు. అయితే ఓ బ్రిటీష్ మహిళ పరిమితులు దాటి టాటూలు వేయించుకుంది. రెండో, మూడో కాదు ఏకంగా 800 టాటూలు వేయించుకుంది.
టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Tecno Camon 20 ప్రీమియర్ 5Gని వినియోగదారుల కోసం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ లో ప్రత్యేక ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో MediaTek Dimension చిప్‌సెట్ ఉపయోగించారు. అంతేకాకుండా సెన్సార్ షిఫ్ట్ OISతో విడుదల చేసిన మొదటి ఫోన్ ఇదే. ఇండియాలో ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 8 GB RAM / 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది.
దేశంలో రుతుపవనాల ప్రారంభంతో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా టమోటాల ధరలు చాలా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర కిలో రూ.150 దాటింది. దీని ప్రభావం సామాన్యులపైనే కాదు రెస్టారెంట్లపైనా పడుతోంది. దీంతో మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. బర్గర్ లో టమోటాలు పెట్టడం లేదని.. దీనివల్ల రుచిలో మార్పు ఉంటుందని తెలిపింది.
త్రిపుర అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయి. కాగా.. తొలిరోజే తీవ్ర గందరగోళం నెలకొంది. భారతీయ జనతా పార్టీ మరియు త్రిపుర మోతా ఎమ్మెల్యేల మధ్య సభలో తీవ్ర చర్చ జరిగింది. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు టేబుల్‌పైకి ఎక్కి నానా హంగామా సృష్టించారు.
వెస్టిండీస్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. గత ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్.. ఎట్టకేలకు టీ20ల్లో స్థానం దక్కించుకున్నాడు. అందరూ అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఆడుతాడని పలువురు క్రికెటర్లు చెప్పారు.
దంతాలను మంచిగా శుభ్రం చేస్తున్నారా..? దంతాలు ఎంత శుభ్రంగా ఉంటే నోరు, ఆరోగ్యం అంతే బాగుంటుంది. ఏదో పైన పైన బ్రష్ చేసి అయిపోయిందనుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కొందరు దంతాలు శుభ్రంగా ఉండటం కోసం పొద్దున, సాయంత్రం బ్రష్ చేస్తారు.
అయితే పాకిస్తాన్ లో ఆడే ఓ ఆట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏ ఆట అనుకుంటున్నారా..? అక్కడ ఆ ఆటను స్లాప్ కబడ్డీగా పిలుస్తారు. వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ ఆటను చూస్తే.. నవ్వుకోకుండా ఉండలేరు. కామన్ గా కబడ్డీలో ఏడుగురు ఉంటారు. కానీ ఈ ఆట ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది. ఒక ఆటగాడు మరొక ఆటగాడిని కొట్టడం ద్వారా పాయింట్‌ను స్కోరు చేస్తాడు.
వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ చెమటలు వచ్చేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్బడోస్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న విరాట్ కోహ్లీ.. అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇండియా -పాకిస్తాన్ అభిమానులు ఒకరినొకరు తిట్టుకునేలా విరాట్ ఏ షాట్ ఆడాడని మీరు అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తే.. బార్బడోస్ లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్.. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడాడు.
ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలో ఉదయం రోడ్డు కుంగింది. బుధవారం ఉదయం ప్రధాన రహదారి మధ్యలో ఉన్నట్టుండి కుంగిపోయింది. 4 గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడింది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై అదృష్టవశాత్తూ ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు.