Umbilical Cord: బొడ్డు తాడు పారేస్తున్నారా? ప్రాణాంతక వ్యాధులను నయం చేసే ‘మెడికల్ మిరాకిల్’ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umbilical Cord: శిశువు జన్మించిన తర్వాత పనికిరాని వ్యర్థంగా భావించి పారవేసే ‘బొడ్డు తాడు’ (Umbilical Cord/Placenta), ఇప్పుడు ఆధునిక వైద్యంలో ఒక అద్భుత సంజీవనిలా మారుతోంది. ప్రాణాంతక వ్యాధులను నయం చేయడమే కాకుండా, శరీరంలోని దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చాలా కాలం వరకు బొడ్డు తాడును కేవలం తల్లి గర్భంలో శిశువుకు పోషణ అందించే అవయవంగానే చూసేవారు. కానీ, ఇందులో ఉండే స్టెమ్ సెల్స్ (Stem Cells), గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్రత్యేకమైన కణజాలాలు అసాధారణమైన చికిత్సా సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాలను బాగు చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని వెల్లడించారు.
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
బొడ్డు తాడులోని ‘అమ్నియోటిక్ మెంబ్రేన్’ (శిశువును రక్షించే పొర) కంటి వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కంటిపై రసాయనాలు పడినప్పుడు లేదా ప్రమాదాల్లో కంటి నల్లగుడ్డు (కార్నియా) దెబ్బతిన్నప్పుడు ఈ పొరను ఒక సహజమైన బ్యాండేజ్‌లా ఉపయోగిస్తున్నారు. ఇది వాపును తగ్గించడమే కాకుండా, మచ్చలు పడకుండా కొత్త కణాలు పెరిగేలా ప్రోత్సహిస్తుంది. తద్వారా రోగికి చూపు పోకుండా కాపాడుతుంది. మధుమేహం (Diabetes) ఉన్న రోగులకు వచ్చే దీర్ఘకాలిక పుండ్లు, తీవ్రమైన కాలిన గాయాల చికిత్సలో కూడా బొడ్డు తాడులోని మూలకాలు కీలకంగా మారాయి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇతర బాహ్య కణజాలాలను త్వరగా అంగీకరించదు. కానీ, అమ్నియోటిక్ మెంబ్రేన్‌ను శరీరం సులభంగా స్వీకరిస్తుంది. ఇందులోని గ్రోత్ ఫ్యాక్టర్స్ కొత్త కణజాలాల ఉత్పత్తిని వేగవంతం చేసి, మొండి పుండ్లను కూడా త్వరగా నయం చేస్తాయి. ఒకప్పుడు మెడికల్ వేస్ట్‌గా పారేసిన బొడ్డు తాడు, నేడు ప్రాణాలను కాపాడే ఆధునిక వైద్య ‘మిస్టరీ’గా మారింది. భవిష్యత్తులో దీనిపై జరిగే మరిన్ని పరిశోధనలు క్యాన్సర్ వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులకు కూడా పరిష్కారం చూపుతాయని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Best Air Coolers: AC అవసరం లేదు.. రూ. 6 వేల లోపు బడ్జెట్‌లోనే బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే!
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!