Richest People: కుబేరుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్.. మొదటి స్థానంలో ఎలాన్ మస్క్.. ఇండియా నుంచి ఎవరంటే..
- ప్రపంచ ధనవంతుల లిస్ట్ విడుదల చేసిన ఫోర్బ్స్ మ్యాగజైన్..
- మొదటి స్థానంలో ఎలాన్ మస్క్..
- ఇండియా నుంచి టాప్ 50లో అంబానీ, అదానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనవంతుల వివరాలతో ఫోర్బ్స్ మ్యాగజైన్ తన వార్షిక జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది ఏకంగా 3,428 మంది బిలియనీర్లు ఈ జాబితాలో చోటు సంపాదించి కొత్త రికార్డు సృష్టించారు. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య 400 పెరిగింది. వీరి అందరి ఆస్తుల మొత్తం విలువ సుమారు 20.1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
అగ్రస్థానంలో ఎలాన్ మాస్క్..
టెస్లా , స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 54 ఏళ్ల మస్క్ సంపద గత ఏడాది కంటే రెట్టింపు అయ్యి 839 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గూగుల్ వ్యవస్థాపకులైన లారీ పేజ్ (257 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో, సెర్గీ బ్రిన్ (237 బిలియన్ డాలర్లు) మూడో స్థానంలో నిలిచారు. మాస్క్ ఆస్తి వీరిద్దరి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.
Also Read
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
Also Read:ACB Raids: అవినీతి వలలో చిక్కిన తహసీల్దార్.. సోదాల్లో కళ్లు చెదిరే డబ్బులు..
టాప్ 10 కుబేరులు వీరే..
ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి పది స్థానాల్లో ఉన్న వారి వివరాలను గమనిస్తే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 224 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉండగా, ఫేస్‌బుక్ (మెటా) బాస్ మార్క్ జుకర్‌బర్గ్ 222 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు. వీరి తర్వాత వరుసగా ఒరాకిల్ సంస్థకు చెందిన లారీ ఎల్లిసన్ (6వ స్థానం), ఎల్‌వీఎంహెచ్ (LVMH) అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ (7వ స్థానం), సెమీకండక్టర్ల దిగ్గజం జెన్సన్ హువాంగ్ (8వ స్థానం), ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (9వ స్థానం) ఉన్నారు. స్పెయిన్‌కు చెందిన జారా (Zara) ఫ్యాషన్ సంస్థ అధినేత అమాన్సియో ఒర్టెగా 148 బిలియన్ డాలర్లతో పదో స్థానాన్ని దక్కించుకున్నారు.
Also Read:LPG Cylinder: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్రం శుభవార్త.. ఇక కష్టాలు తప్పినట్లే…
భారత్ నుంచి సత్తా చాటిన అంబానీ, అదానీ
ఈ అంతర్జాతీయ జాబితాలో భారతదేశం నుంచి ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు టాప్ 50లో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 99.7 బిలియన్ డాలర్ల ఆస్తితో ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానంలో నిలిచారు. వివిధ రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన అంబానీ.. భారతదేశం తరపున అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
అలాగే.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 63.8 బిలియన్ డాలర్ల సంపదతో 31వ స్థానంలో నిలిచారు. మౌలిక సదుపాయాలు, ఇతర రంగాల్లో అదానీ గ్రూప్ సాధిస్తున్న వృద్ధి ఆయనను ఈ జాబితాలో నిలబెట్టింది. మొత్తంగా చూస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టెక్నాలజీ, రిటైల్ , మౌలిక సదుపాయాల రంగాలకు చెందిన వ్యక్తులు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. స్టాక్ మార్కెట్ ధరలు, కరెన్సీ మార్పిడి రేట్ల ఆధారంగా మార్చి 1వ తేదీ వరకు ఉన్న లెక్కల ప్రకారం ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!