ఇండియాలో క్రికెట్ తర్వాత ఎక్కువగా క్రేజ్ ఉన్న ఆట.. కబడ్డీ. మనం కూడా చిన్నప్పుడు ఆడే ఉంటాం. ఇప్పుడు దేశ వ్యాప్తంగా యువత కూడా ఆటలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందులో కబడ్డీ ఆటలో శిక్షణ తీసుకుని.. జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. ఇండియాలో ప్రో కబడ్డీ అని చూసే ఉంటాం. అందులో రాష్ట్రాలకు సంబంధించిన ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించి.. జాతీయ స్థాయిలో ఆడుతున్నారు.
Bandi Sanjay: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో బండి సంజయ్ భేటీ
అయితే పాకిస్తాన్ లో ఆడే ఓ ఆట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏ ఆట అనుకుంటున్నారా..? అక్కడ ఆ ఆటను స్లాప్ కబడ్డీగా పిలుస్తారు. వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ ఆటను చూస్తే.. నవ్వుకోకుండా ఉండలేరు. కామన్ గా కబడ్డీలో ఏడుగురు ఉంటారు. కానీ ఈ ఆట ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది. ఒక ఆటగాడు మరొక ఆటగాడిని కొట్టడం ద్వారా పాయింట్‌ను స్కోరు చేస్తాడు. అయితే మరో ఆటగాడు ఈ పాయింట్‌ని కోల్పొకుండా ప్రత్యర్థి నుంచి కాపాడుకుంటాడు. ఇందులో పంచ్‌లను ఫౌల్ లుగా పరిగణిస్తారు.
Virat Kohli: కోహ్లి ఆ షాట్పై ఇండియా-పాకిస్తాన్ ఫ్యాన్స్ ఫైట్..!
ఇప్పుడు ఈ స్లాప్ కబడ్డీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ ఆటగాళ్లకు డబ్బును.. ఆటను చూడటానికి వచ్చిన వారి నుంచే ఇస్తారు. అయితే ఈ ఆట మాత్రం పాకిస్తాన్‌లో ఎంతో ఫేమస్. ”ఒక ఆటగాడు తన ప్రత్యర్థిని ఎన్నిసార్లైనా కొట్టవచ్చు. ఇక్కడ సంఖ్య అంత ముఖ్యం కాదు. ఆటగాళ్లు గాయాలు తగలకుండా ప్రయత్నిస్తారు.” అని పాకిస్థాన్ స్లాప్ ఆటగాడు ఒకరన్నారు.
https://twitter.com/i/status/1674394956830498819