American Airlines: జస్ట్ 30 సెకన్లు హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే.. ఎయిర్‌లైన్స్ రూల్స్ బ్రేక్ చేసిన మహిళకు షాక్
- జస్ట్ 30 సెకన్లు హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే
- ఎయిర్‌లైన్స్ రూల్స్ బ్రేక్ చేసిన మహిళకు షాక్
- పోలీసులు విమానంలోకి వచ్చి ఆమెను బలవంతంగా దింపేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే చేసిన మహిళను సిబ్బంది విమానం నుంచి దించేశారు. మయామి నుంచి టాంపా వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఒక మహిళ హెడ్‌ఫోన్స్ ఉపయోగించకుండా తన ఫోన్‌లో వీడియోను లౌడ్‌గా ప్లే చేసింది. ఫ్లైట్ అటెండెంట్లు రెండుసార్లు హెడ్‌ఫోన్స్ ఉపయోగించమని లేదా వీడియో ఆపమని అడిగినా, ఆమె అందుకు సహకరించలేదు. వీడియో ప్లే చేసినందుకు సిబ్బంది ఆమెను హెచ్చరించిన తర్వాత కూడా ఆమె వాదనలు చేస్తూ, తిట్టడం మొదలుపెట్టింది. “నేను 30 సెకన్లు మాత్రమే 50% వాల్యూమ్‌లో వీడియో ప్లే చేశాను, అందుకే నన్ను దింపేస్తున్నారా?” అంటూ ఆమె అరిచింది. “పోలీసులను పిలవండి” అని కూడా ఆమె సవాలు విసిరింది.
Also Read:Telegram: యూజర్లకు అలర్ట్! టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే?
Also Read
ఆ తర్వాత పోలీసులు విమానంలోకి వచ్చి ఆమెను బలవంతంగా దింపేశారు. ఆమె బయటికి వెళ్తుంటే ఇతర ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. కొందరు సాక్షులు ఆమె మద్యం సేవించినట్లు (డ్రంక్) చెప్పారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ అయింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో అధికారికంగా హెడ్‌ఫోన్స్ తప్పనిసరి అనే రూల్ లేకపోయినా, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే నియమాలు ఉన్నాయి. ఇటీవల యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి ఇతర ఎయిర్‌లైన్స్ కూడా ఫోన్‌లో ఆడియో/వీడియోలకు హెడ్‌ఫోన్స్ తప్పనిసరి చేస్తున్నాయి. ఈ ఘటన ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణికుల ప్రవర్తనపై చర్చలకు దారితీసింది.
Woman has meltdown as she is kicked off of an American Airlines flight for making everyone listen to her loud videos playing on her phone.
The incident comes as airlines are starting to make people wear headphones or be banned from flying.
“A drunk lady on an American Airlines… pic.twitter.com/TC8lxpDEFK
— Collin Rugg (@CollinRugg) March 8, 2026
తాజావార్తలు
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!