వర్షం పడితే చాలు ఎక్కడ రోడ్డు కుంగుతుందో తెలియకుండా మారిపోయింది. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల రోడ్లు కుంగిపోతున్నాయి. దానికి గల కారణం రోడ్లు బలంగా నిర్మించకపోవడమా..లేదంటే భూకంపం లాంటి పరిణామాలు ఏమైనా అని జనాలు చర్చించుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలో ఉదయం రోడ్డు కుంగింది.
Payal Rajput : ప్రభాస్ తో కలిసి ఆ సినిమా చూడాలని ఉంది..
బుధవారం ఉదయం ప్రధాన రహదారి మధ్యలో ఉన్నట్టుండి కుంగిపోయింది. 4 గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడింది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై అదృష్టవశాత్తూ ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు.
#WATCH | A large portion of road caved in Delhi's Janakpuri area this morning. No injuries were reported. pic.twitter.com/otjQitTJix
— ANI (@ANI) July 5, 2023
అటు లక్నోలోని బలరాంపూర్ ఆసుపత్రి సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు కుప్పకూలడంతో కారు సగానికి పడిపోయింది. మూడేళ్ల క్రితం స్మార్ట్‌సిటీ పథకం కింద సీవర్ లైన్ వేసి ఈ రోడ్డు నిర్మించారు. అయితే ఈ ప్రమాదంపై కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని జల్ నిగమ్ ఇంజనీర్ పీయూష్ మౌర్య తెలిపారు. గతంలో మథురలో రోడ్డు కూలిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎం యోగి పర్యటన దృష్ట్యా బృందావన్‌లో పీడబ్ల్యూడీ శాఖ రహదారిని నిర్మించింది. సీఎం పర్యటనకు ముందే రోడ్డు గుంతలమయమైంది.
HDFC Bank: బ్యాంక్ కొత్త స్కీమ్..రూ. 5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు మీ సొంతం..
ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో బుధవారం అకస్మాత్తుగా రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి చాలా వాహనాలు చిక్కుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.