Viral News: శరీరంపై టాటూలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ అనుకుంటారు. అంతేకాకుండా అందరి దృష్టి వారిపైనే ఉంటుందని టాటూలు వేసుకుంటారు. అయితే ఓ బ్రిటీష్ మహిళ పరిమితులు దాటి టాటూలు వేయించుకుంది. రెండో, మూడో కాదు ఏకంగా 800 టాటూలు వేయించుకుంది. ఇప్పుడవే ఆమే పాలిట శాపంగా మారాయి.
Chhattisgarh: రూ.7,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
యూకేకు చెందిన ఆ మహిళ పేరు మెలిస్సా స్లోన్(46). 800 టాటూలు వేసుకున్న మహిళ.. ఉద్యోగం లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంతకుముందు టాయిలెట్ క్లీన్ చేసే ఉద్యోగమైన ఉండేదని.. కానీ ఆ ఉద్యోగం దొరకడం లేదని ఆరోపిస్తుంది. ఎక్కడకు వెళ్లినా టాటూల కారణంగా ఉద్యోగం ఇవ్వడం లేదని తెలుపుతుంది.
Minister Botsa Satyanarayana: సింగిల్ గానే పోటీ.. ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తులు..!
మెలిస్సా తన 20 ఏట నుంచి టాటూలు వేయించుకోవడం మొదలుపెట్టింది. మొదట్లో వారానికి రెండు మూడు కొత్త టాటూలు వేసుకునేది. కానీ రాను రాను ఎక్కువగా వేసుకునేది. టాటూలకు వ్యసనంగా మారిన మెలిస్సా.. ఇప్పుడు శరీరమంతా పచ్చబొట్లతో నిండిపోయింది. దీంతో చూడటానికి ఇబ్బందికరంగా మారిపోయింది. అందుకే ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి అందరూ నిరాకరిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు మెలిస్సాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టాటూలంటే తనకు ఇష్టమని.. బహుశా నా కన్న టాటూలు ఎవరి శరీరంపై ఉండవని మెలిస్సా తెలుపుతోంది.