తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. సుమారు రెండున్నర గంటల పాటు భేటీ జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసంతో పాటు పలు రాజకీయపరమైన అంశాలపై చర్చ జరిగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే వైఖరి మానుకోవాలని హితవు పలికారు. ఉదయం లేచిన దగ్గర నుంచి కేటీఆర్ తిట్ల దండకం అందుకుంటున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బహిరంగ విచారణకు హాజరు కావాలంటూ రామకృష్ణారావుకు కాళేశ్వరం కమిషన్ సోమవారం సమన్లు పంపింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు లంచ్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.
భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం వివాహం చేసుకున్నారు. అతను తన కుటుంబంతో కలిసి కనిపించిన వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్ పెళ్లి చేసుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. 'సీఎం సర్.. ఆల్ ది బెస్ట్' అంటూ విష్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలెపూర్ గ్రామం వద్ద ఐచర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో డీసీఎం వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్‌పై వైసీపీకి చాలా అనుమానాలు ఉన్నాయని సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ముసుగులో కూటమి పార్టీలు గుద్దులాడుతున్నాయని ఆరోపించారు.