Trump: ప్రపంచ దేశాలపై ట్రంప్ మరో అస్త్రం.. లిస్ట్‌లో భారత్, చైనా?
- తగ్గేదేలే అంటున్న ట్రంప్
- ప్రపంచ దేశాలపై ట్రంప్ మరో అస్త్రం
- లిస్ట్‌లో భారత్, చైనా సహా 16 దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతున్నా.. ట్రంప్ మాత్రం తనకేమీ పట్టనట్టు ‘‘తగ్గేదేలే’’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పరిణామం ట్రంప్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బగానే మిగిలింది. ఆ షాక్‌తో ఆగ్రహంతో రగిలిపోయిన ట్రంప్.. అలా సుంకాలను రద్దు చేసిందో లేదో.. వెనువెంటనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకం విధించారు. అహం చల్లారలేదో.. ఏమో తెలియదు గానీ గంటల వ్యవధిలోనే 10 శాతాన్ని 15 శాతానికి పెంచేశారు. ఈ సుంకాలను 150 రోజులు అమలు చేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు.
ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా మరో అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రపంచ దేశాలపై సెక్షన్ 301 ఆయుధాన్ని బయటకు తీశారు. ఎలాగైనా ప్రపంచ దేశాల నుంచి సుంకాల వసూలు చేయాలన్న లక్ష్యంతో ఉన్న ట్రంప్ ఈ కొత్త అస్త్రాన్ని వెలుగులోకి తెచ్చారు. సెక్షన్ 301 అస్త్రంతో భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తు జరగనుంది. ఈ మేరకు అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసన్ గ్రీర్ ఒక కీలక ప్రకటన చేశారు. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద.. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేసియా, మలేసియా, కాంబోడియా, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, సింగపూర్, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జపాన్ దేశాలపై ఈ దర్యాప్తు జరగనుంది. ఈ దేశాల్లో కెనడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
సెక్షన్ 301 అంతరార్థం ఇదే
గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసిన కారణాన ఇతర దేశాలు అనుసరిస్తున్న ‘‘అన్యాయమైన వాణిజ్య విధానాలను’’ సవాలు చేసేందుకు అమెరికా దగ్గర ఉన్న పవర్‌ఫుల్ ఆయుధమే సెక్షన్ 301. వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న ట్రేడ్ పాలసీలు.. అమెరికా వ్యాపారాలకు, ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా? అనేదానిపై ఈ చట్టం కింద అమెరికా దర్యాప్తు చేసేందుకు అధికారం లభిస్తుంది. ఏదైనా దేశం తమకు నష్టం కలిగించేలా ట్రేడ్ పాలసీలను అనుసరిస్తుందని తేలితే.. ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే ఆ దేశంపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం కింద అధికారం ఉంటుంది. అలాంటి దేశాలపై చట్టబద్ధంగా భారీ సుంకాలు విధించడం లేదా ప్రతీకార చర్యలు తీసుకునేందుకు అమెరికాకు మార్గం సుగమం అవుతోంది. అందుకోసమే ట్రంప్ సర్కార్ తాజాగా సెక్షన్ 301 అస్త్రాన్ని బయటకు తీసింది.
ఇప్పటికే పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే.. తాజాగా ట్రంప్ పరిపాలన సెక్షన్ 301 అస్త్రాన్ని వాణిజ్య దేశాలపై సంధిస్తోంది. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: India-Iran: సంక్షోభం వేళ భారత్‌కు శుభవార్త.. ఇరాన్‌తో ఫలించిన జైశంకర్ దౌత్యం
తాజావార్తలు
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?