సంక్రాంతి పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపించింది. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు 3800 సర్వీసులు నడిపించింది ఏపీఎస్ఆర్టీసీ.
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ అనుభవంతో ప్రజలకు సంపదను సృష్టిస్తా అని చెప్పా.. అభివృద్ధి వల్ల సంపద వస్తుందని సీఎ చంద్రబాబు అన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇంజనీర్ కాలేజ్ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్.. హాస్టల్‌లో దూరి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు. కాలేజీ యజమాని డ్రైవరే ఈ ఘటనకు పాల్పడ్డాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతల గురించి ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ తమ అంచనాలను వెల్లడించారు. మైఖేల్ అథర్టన్ మాట్లాడుతూ.. " దక్షిణాఫ్రికాకు మద్ధతిస్తున్నాను. ప్రతి టోర్నమెంట్‌లో గెలిచే వరకు పోరాడతారు. సౌతాఫ్రికా జట్టు బలంగా ఉంది. ఈ ట్రోఫీని దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంటుంది." అని మైఖేల్ అథర్టన్ తెలిపాడు. మాజీ ఇంగ్లీష్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌కు చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా.. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఆస్ట్రేలియా…
కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనం సిబ్బందిపై కాల్పులు జరిపారు. బైకుపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నగదు పెట్టెతో దొంగలు పరారయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రక్కదారి పట్టించడానికే అరెస్టులని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గట్టిగా ఆరు గ్యారంటీలు అడిగుతే తమపై కేసులు పెడుతున్నారు.. కేటీఆర్ ఇచ్చిన పథకాలను అడిగితే తమపై కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతీ నెల 3 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500కే ఉచిత సిలిండర్ గ్యారంటీలను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.
తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్ఆర్‌డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.