Telugu Cinema : వెండితెరకు ‘రక్తాభిషేకం’ మితిమీరిన వైలెన్స్‌తో హిట్లు వస్తాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ఒకటే ట్రెండ్ నడుస్తోంది. అదే ‘వైలెన్స్’. సినిమా టైటిల్ కార్డ్ పడినప్పటి నుండి ఎండ్ కార్డ్ వరకు తెరపై రక్తం ఏరులై పారాల్సిందే. కత్తులతో ఊచకోత కోస్తేనే కలెక్షన్స్ వస్తాయని, గన్ కల్చర్‌ను చూపిస్తేనే బాక్సాఫీస్ మురిసిపోతుందని మేకర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు కథ కంటే మితిమీరిన హింసకే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో సామాన్య ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.
Also Read : Anushka Shetty : అనుష్క ఏం చేస్తుంది.. సినిమా కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టేనా?
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో భారీ అంచనాలతో వచ్చిన రజనీకాంత్ ‘కూలీ‘, బాలకృష్ణ ‘అఖండ 2‘ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. కేవలం భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, రక్తపాతం నమ్ముకున్న ఈ చిత్రాలు కథా లోపం వల్ల బాక్సాఫీస్ వద్ద ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ మేకర్స్ తీరు మారడం లేదు. రాబోయే ‘కల్ట్’, ‘టాక్సిక్‘ వంటి చిత్రాల టీజర్లు చూస్తుంటే అవి వైలెన్స్‌కు పరాకాష్టగా నిలుస్తాయని స్పష్టమవుతోంది. సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యానిమల్‘ చిత్రంలో క్లైమాక్స్ సీన్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది కేవలం హింసను గ్లోరిఫై చేయడమేనని మేధావులు మండిపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ కమర్షియల్‌గా వర్కవుట్ అయినప్పటికీ అందులో చూపించిన హింస హద్దులు దాటిందనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు నాని నటిస్తున్న ‘ప్యారడైజ్‘, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్‘ చిత్రాలు కూడా ఇదే బాటలో పయనిస్తూ రక్తపాతం సృష్టిస్తాయా అన్న ఆందోళన నెలకొంది. సినిమా అంటే ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి చూసే వినోదం. కానీ, ఇప్పుడు థియేటర్లలో కనిపిస్తున్న ‘ఓవర్ యాక్షన్’ మరియు అతి హింస వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడుతున్నారు. కేవలం మాస్ ప్రేక్షకులను, యూత్‌ను ఆకట్టుకోవాలనే తాపత్రయంలో దర్శకులు హుందాతనాన్ని మరిచిపోతున్నారు. కథలో దమ్ము లేనప్పుడు కేవలం రక్తాభిషేకం చేస్తే సినిమాలు హిట్టయిపోవు అనే నిజాన్ని మేకర్స్ ఎప్పుడు గ్రహిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!