ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలెపూర్ గ్రామం వద్ద ఐచర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామానికి చెందిన ఆదివాసిలు జంగుబాయి దర్శనానికి వెళ్లి వస్తుండగా నార్నూర్ మండలం మాలెపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 50 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 30 మంది వరకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని ముందుగా ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఐదుగురిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Read Also: Encounter: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు ట్రాప్..
తెలంగాణలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో డీసీఎం వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో డీసీఎం వాహనంలో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Bhanu Chander: ఏపీలో సినీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తాం..