విజయవాడ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం టెంట్ దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే కుర్చీలు వేశారు అధికారులు.
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడని ఆరోపించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. దేవస్థానం కార్యాలయంలో తాగిన మద్యం బాటిల్స్, తిని పాడేసిన బిర్యానీ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఆలయ సిబ్బంది నిర్వాహకంగా అనుమానిస్తున్నారు.
విశాఖ నగర నడిబొడ్డున భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 176 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు బెట్టింగ్ కేటుగాళ్లు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారని అన్నారు. నచ్చితే కాళ్ళు.. నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ రాజకీయ నేత చంద్రబాబని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాప ప్రక్షాళన చేస్తాను అని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కేంద్ర హోం శాఖ విపత్తుల నిర్వహణ శాఖ విచారణకు ఆదేశిస్తే, మీరు రద్దు చేయించారని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కూడా ఉన్నారు.
జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వం చేయించుకొని ప్రమాదవశాత్తు మృతి చెందిన క్రియాశీలక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు బకాయి పెట్టి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఒక్క వైసీపీ మాత్రమేనని ఆరోపించారు.