కాళేశ్వరం కమిషన్ ముందు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు విచారణ ముగిసింది. కాళేశ్వరం కార్పొరేషన్ – లోన్స్ – ప్రాజెక్టు డిజైనులు, బడ్జెట్ కేటాయింపుల అంశాలపై కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్‌కు నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నించింది. కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా పొందుతారని రామకృష్ణరావును కమిషన్ క్వశ్చన్ చేసింది. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని రామకృష్ణ రావు కమిషన్‌కు చెప్పారు. డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ పేర్కొంది.
Read Also: Auto Expo 2025 : మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పోలో జిమ్నీ ప్రదర్శన… భవిష్యతులో థార్ కు గట్టిపోటీ
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం ఏంటి? ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని ఎలా సమకూర్చారు ఎలా చేస్తారు..? అని కమిషన్ ప్రశ్నించింది. పరిశ్రమలకు నీళ్లు అమ్ముకోవడం, త్రాగునీటి వ్యాపారం చేయడంతో ఆదాయాన్ని అర్జిస్తామని రామకృష్ణ రావు కాళేశ్వరం కమిషన్‌కు చెప్పారు. ప్రతి ఏడాదికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రిన్సిపల్ అమౌంట్ రూ.7382 కోట్లు, ఈ ఏడాది 6519 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామని రామకృష్ణారావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్స్‌కి 9నుంచి 10.5 శాతం వడ్డీతో రీ పేమెంట్ చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని రామకృష్ణ రావు కమిషన్ ముందు చెప్పారు.
Read Also: Adi Srinivas: నీ వల్ల సిరిసిల్లలో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదు.. కేటీఆర్ పై ఫైర్
మరోవైపు.. ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని కాళేశ్వరం కమిషన్ తెలిపింది. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీ పెట్టలేదని రికార్డులను చూపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్‌గా క్యాబినెట్ ముందుకు రాలేదని కమిషన్ తెలిపింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని పేర్కొంది. రామకృష్ణారావుకు నిబంధనలు పాటించని అంశాల రికార్డులను కమిషన్ చూపించింది. ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులను మైంటైన్ చేయలేదని కమిషన్ తెలిపింది. ఈ క్రమంలో.. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారెంటీతోనే లోన్లు కార్పొరేషన్ తీసుకుందని రామకృష్ణరావు కాళేశ్వరం కమిషన్‌కు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎంత ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం నీటిని పరిశ్రమలకు విక్రయించడం ద్వారా రూ.7 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణ రావు తెలిపారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 95 వేల కోట్ల పైచిలుకు డబ్బులు ఖర్చు చేసిందని కమిషన్‌కు బ్యూరోక్రాట్స్ గతంలో స్పష్టం చేసింది.