విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్‌పై వైసీపీకి చాలా అనుమానాలు ఉన్నాయని సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ముసుగులో కూటమి పార్టీలు గుద్దులాడుతున్నాయని ఆరోపించారు. ప్రయివేటీకరణ వ్యూహం అమలులో భాగంగానే ప్యాకేజ్ అనేది ఖచ్చితంగా చెబుతున్నాం.. అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు ఇస్తే పరిశ్రమ ఏ విధంగా నడుస్తుంది..? అని ప్రశ్నించారు. కార్యచరణ ప్రకటించకుండా ప్యాకేజ్ ప్రకటించడం వెనుక మతలబు ఉందని అన్నారు. ప్యాకేజ్ అనేది ప్రలోభ పెట్టడమే తప్ప ప్రయోజనం చేకూర్చేది కాదని తెలిపారు.
Read Also: Side Effects of Antibiotics: గుండె రోగులకు యాంటీబయాటిక్స్ సరైనవేనా?
ప్రయివేటీకరణ ఆలోచన కేంద్రానికి లేకపోతే ప్రధాని సభలో కానీ అమిత్ షా టూర్ లో ఎందుకు చెప్పలేదని ఎమ్మెల్సీ బొత్ససత్యనారాయణ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అడ్డుపడటం వల్లే ప్రయివేటీకరణకు కేంద్రం సాహసం చేయలేదని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పోరాటం చేస్తాం.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉండాలనేది తమ విధానం అందుకోసం తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దివాళా తీసే స్థితిలో ఉన్న పరిశ్రమకు ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా ఎటువంటి మేలు జరగదని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆర్భాటం, ప్రచార యావ తప్ప ప్రజారక్షణ పై బాధ్యత లేదనేది అర్ధం అవుతూందని పేర్కొన్నారు.
Read Also: Trump Trip To India: భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తి.. సలహాదారులతో చర్చ..
తిరుపతి ఘటనపై కేంద్రం విచారణ జరక్కుండా అడ్డుకుని పరువు కాపాడుకున్నామని ప్రభుత్వం భావిస్తోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. దురదృష్టకర సంఘటనలు జరక్కుండా చూసుకున్నప్పుడు మాత్రమే పరువు నిలబడుతుంది.. తిరుపతి ఘటనపై న్యాయ విచారణ కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశానని చెప్పారు. సుమోటోగా తీసుకుని జ్యుడీషియల్ విచారణ జరిపించమని విజ్ఞప్తి చేశానన్నారు. అమిత్ షా టూర్ లో రాష్ట్రానికి జరిగే మేలు గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గురించి చర్చించడం దౌర్భాగ్యం అని దుయ్యబట్టారు. ఋషికొండ భవనాలు ముమ్మాటికీ ప్రభుత్వ ఆస్తే.. అవకతవకలు ఉంటే విచారించుకోవచ్చన్నారు. మరోవైపు.. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ కోసం ఈనెల 29 వరకు చూస్తాం.. ప్రభుత్వం ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని అన్నారు.