బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే వైఖరి మానుకోవాలని హితవు పలికారు. ఉదయం లేచిన దగ్గర నుంచి కేటీఆర్ తిట్ల దండకం అందుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయని తెలిపారు. ఈ రోజు నుంచి మరో నాలుగు పథకాలు అందిస్తామని అన్నారు. అంతేకాకుండా… రేషన్ కార్డులకు సంబంధించి ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని పేర్కొ్న్నారు.
Read Also: Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన రామకృష్ణారావు విచారణ..
స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు చీరలు ఇవ్వబోతుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. చీరల తయారీ ఆర్డర్‌ను సిరిసిల్ల పవర్‌లూమ్స్‌కు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. మొదటి దశలో 4.6 కోట్ల సెంటీమీటర్ల చీరల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.. ఈ ఆర్డర్ ఫలితంగా ఎనిమిది నెలల పాటు పవర్ లూమ్స్ కార్మికులకు పని దొరుకుతుందని పేర్కొన్నారు. ఆర్డర్‌లోని 95 శాతం పనులు సిరిసిల్లలో 20 వేల పవర్‌లూమ్స్‌కే ఇచ్చామని వెల్లడించారు. కమిషన్లకు కక్కుర్తిపడి బతుకమ్మ చీరలు కిలోల చొప్పున సూరత్ నుంచి గత ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెచ్చామని కేటీఆర్ అసెంబ్లీలో ఒప్పుకున్నాడు.. కేటీఆర్ పదేళ్లు మంత్రిగా ఉండి సిరిసిల్ల ప్రాంతానికి నూలు డిపో తేలేక పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వల్ల సిరిసిల్లలో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు.
Read Also: Auto Expo 2025 : మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పోలో జిమ్నీ ప్రదర్శన… భవిష్యతులో థార్ కు గట్టిపోటీ