Ashwini Vaishnav: సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్.. టార్గెట్ అదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే.. ఫేక్ ఐడీలతో మోసగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటినుంచి సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసుల వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. బల్క్ సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపై కూడా ఆంక్షలు విధించింది.
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
ప్రస్తుతం కొంతమంది సిమ్ డీలర్లు వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇకపై అలా జరగకుండా.. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని.. అలా చేయని ఎడలా వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నారని.. వారు వెరిఫికేషన్ పూర్తి చేయాలని అందుకోసం తగిన సమయం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.
Ghulam Nabi Azad: హిందూ-ముస్లింలపై గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇకపై.. బల్క్ కనెక్షన్ల నిబంధనను తొలగించి, కొత్త విధానం(బిజినెస్ కనెక్షన్లు) పేరుతో అందుబాటులోకి తెస్తున్నట్లు అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. ఆ విధానంలో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అన్నారు. బిజినెస్‌లకు కేవైసీ సహా, సిమ్ కార్డులు విక్రయించే వారి కేవైసీ కూడా తప్పనిసరిగా ఉంటుందని వివరించారు. ఇటీవలే.. 52 లక్షల మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అంతేకాకుండా 67వేల మంది డీలర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని.. 2023 మే నుండి సిమ్ కార్డ్ డీలర్లపై 300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 66వేలకు పైగా మోసపూరిత వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఇందుకు కారణం మోసపూరిత లావాదేవీలేనని అన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టే కేంద్రం కొత్త రూల్స్ తో మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు.
తాజావార్తలు
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!