సవాళ్ల సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఆశాకిరణంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఈ సవాలు సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాకిరణంలా ప్రకాశిస్తోందని ఆయన శనివారం అన్నారు.
దేశంలో ఉల్లి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ధరలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై భారీగా వడ్డన విధించింది. ఉల్లి ఎగుమతులపై వసూలు చేస్తోన్న పన్ను మొత్తాన్ని భారీగా పెంచింది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది.
అప్పుడే పుట్టిన ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను తీసింది ఓ నర్సు. తన వృత్తికే కాదు.. మానవత్వానికి మచ్చ తీసుకొచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న లూసీ లెట్బీ అనే నర్సు.. ఏడుగురు నవజాత శిశువులను హత్య చేయగా.. మరో ఆరుగురు చిన్నారులను హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు.. దేశంలో లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం (ఆచార్య ప్రమోద్) స్పందించారు. ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
భారీ కొండచిలువతో నక్క భీకర దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతకుముందు మరో నక్కను భారీ పైథాన్ చుట్టేసింది. ఈ క్రమంలో దాని నుండి రక్షించేందుకు నక్క తీవ్రంగా పోరాడింది.
సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని రకరకాల ప్రదేశాలను ఎంచుకుంటున్నారు నెటిజన్లు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా.. ఎక్కడ హైలెట్ గా నిలుస్తారో అక్కడే స్టంట్స్, వీడియోలు చేస్తూ చూపిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో సోషల్ మీడియా వీడియోలకు ఫ్లాట్ ఫాంగా మారింది. ఢిల్లీ మెట్రోలో చాలాసార్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే మెట్రోలో ఇలాంటి వీడియోలు చేయడానికి అనుమతి లేదని పలుమార్లు చెప్పినప్పటికీ.. బుద్ధి మారడం లేదు. […]
ఉత్తరప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలకు ఉన్నావ్‌లో వరదనీరు ముంచెత్తింది. అంతేకాకుండా.. డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో ఉన్నావ్ గ్రామం నీటిలో మునిగిపోయింది. మరోవైపు అక్కడి నివాసముండే ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. అంతేకాకుండా.. రోడ్లు, కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. అక్కడి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అత్యవసరంగా ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే పడవల సహాయంతో వెళ్తున్నారు.
బంగ్లాదేశ్ క్రికెటర్ నిప్పులపై నడిచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అయితే తాను నడిచింది ఏదో మొక్కుబడి కోసం కాదు. మెదడు చురుగ్గా ఉండటం కోసమని చెబుతున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఓ వ్యక్తి హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేసి పామును రోడ్డు దాటించేందుకు సహాయం చేస్తున్నాడు. మాములుగా అయితే జనాలు రోడ్డుపై పామును చూస్తే.. చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ వ్యక్తి పామును సురక్షితంగా రోడ్డు దాటిస్తున్నాడు.