INS Vindhyagiri: ‘ఐఎన్ఎస్ వింధ్యగిరి’ ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ నేవీలోకి సరికొత్త యుద్ధనౌక చేరింది. ఐఎన్ఎస్ వింధ్యగిరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రాదేశిక సముద్ర జలాలపై భారత నావికాదళానికి మరింత పట్టును అందించనుంది స్టెల్త్ యుద్ధనౌక. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా.. హుబ్లీ నదీ తీరంలో ఉన్న ప్రభుత్వ రంగ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ వద్ద వింధ్యగిరి యుద్ధనౌకను లాంఛనంగా సముద్ర జలాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ వింధ్యగిరి ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. అంతేకాకుండా.. ఇది భారత నావికాదళ సామర్థ్యాలను మరింత విస్తృతం చేసే ఘట్టం అని అభివర్ణించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు.
BRS First List: గెలుపు గుర్రాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఇదే..?!
Also Read
‘వింధ్యగిరి’ అనేది కర్ణాటక రాష్ట్రంలోని ఓ పర్వత శ్రేణి పేరు. ‘ప్రాజెక్ట్ 17ఎ’లో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధనౌక ఇది. ఇదే పేరుతో గతంలో ఉన్న యుద్ధనౌక 31 ఏళ్లపాటు సేవలందించింది. 2012 దాకా అది పలు క్లిష్టతరమైన ఆపరేషన్లలో పాల్గొని సత్తా చాటింది. మరోవైపు ఈ నౌకను నౌకాదళానికి అప్పగించే ముందు విస్తృత స్థాయిలో.. వివిధ రకాలుగా పరీక్షించి చూస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. ‘పీ17ఎ’ నౌకలన్నీ గైడెడ్ మిస్సైల్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒక్కో నౌక పొడవు 149 మీటర్లు ఉంటుంది. 6,670 బరువుతో.. ఇవి 28 నాట్స్ వేగంతో ప్రయాణించగలవని ఓ అధికారి తెలిపారు. మరోవైపు ఇవి.. భూమి, ఆకాశం, నీటి లోపల నుంచి ఎదురయ్యే సవాళ్లకు ఇవి దీటుగా బదులిస్తాయని రక్షణశాఖ తెలిపింది.
Amala Paul : హాట్ గా సెల్ఫీ దిగుతూ రెచ్చగొడుతున్న అమలా పాల్.
చైనా, పాకిస్థాన్ లను దృష్టిలో ఉంచుకుని… భారత్ ప్రాజెక్ట్ 17 ఆల్ఫా (పీ17ఏ) పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా 7 అత్యాధునిక నౌకలను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 5 యుద్ధ నౌకలు జలప్రవేశం చేశాయి. చైనా 355 యుద్ధ నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నావికాదళాన్ని కలిగి ఉంది. పైగా, యుద్ధనౌకల తయారీలో పాకిస్థాన్ ను కూడా ప్రోత్సహిస్తూ, సహకారం అందిస్తూ భారత్ కు సవాళ్లు విసురుతోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, భారత్ తన నేవీని భారీగా విస్తరిస్తోంది.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్‌డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!