ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన ఫర్వాలేదనట్టు అనిపించినప్పటికీ.. మిడిలార్డర్ల సమస్య భారత్ ను వెంటాడుతుంది. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు ప్రస్తుతం మ్యాచ్ లు ఆడటానికి ఫిట్‌గా లేరు. వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు.. మిడిలార్డర్లను వెతికేపనిలో ఉన్నారు. అయితే మిడిలార్డర్ లో ఆడటానికి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు బెస్ట్ అని మాజీ సెలక్టర్ సబా కరీమ్ అభిప్రాయపడ్డారు.
Kadiam Srihari: ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది
ఫిట్‌గా ఉంటే కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లను సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశముందని సబా కరీమ్ అన్నారు. ఆసియా కప్ లో వారికి అవకాశం రావచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇషాన్ కిషన్ ను సెలక్ట్ చేస్తే.. అతను ఓపెనింగ్‌తో పాటు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలడని తెలిపాడు. అంతేకాకుండా.. శ్రేయాస్ అయ్యర్ ఫిట్ కాకపోతే మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తిలక్ వర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్‌లకు అవకాశం ఇవ్వొచ్చని తెలిపారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ని ఎంపిక చేయాలనుకుంటున్నట్లు సబా కరీం తెలిపాడు. అతనికి నేషనల్, ఇంటర్నేషనల్ వన్డేల అనుభవం ఉందని.. అతను అయితేనే బెస్ట్ అని సబా కరీమ్ పేర్కొన్నారు.
సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు భారత్ తరఫున 26 వన్డేలు ఆడాడు. అతను 511 పరుగులు చేయగా.. అందులో 2 అర్ధ సెంచరీలు సాధించాడు. దేశవాళీ మ్యాచ్‌ల్లో అతనికి మంచి రికార్డు ఉంది. మరోవైపు.. ఇషాన్ కిషన్ ఇండియా తరపున 17 వన్డేలు ఆడాడు. అతను 694 పరుగులు చేయగా.. అందులో ఒక డబుల్ సెంచరీ సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 210 పరుగులు. వన్డేల్లో భారత్ తరఫున ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేశాడు.