వాహనాలపై స్టంటింగ్ చేస్తున్న వీడియోలు తరచూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. తమ ప్రాణాలను పణంగా పెట్టి బైక్‌లు, కార్లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఆకతాయిలు చేసే ఈ స్టంట్లకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. వారిలో మార్పు రావడం లేదు. అయితే తాజాగా కారుపై పడుకొని స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. ఈ వీడియోలో.. ఓ యువకుడు కారు పైకప్పుపై పడుకుని విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో రోడ్డుపై ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. అంతేకాకుండా.. ఆ కారు అక్కడక్కడ క్రాస్ చేస్తూ చాలా వాహనాలను ఓవర్ టేక్ చేస్తున్నట్లు కనిపించింది.
Read Also: Sound Party Teaser: సౌండ్ పార్టీ చేస్తున్న వీజే సన్నీ .. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందే..
@Nitinparashar__ అనే వినియోగదారు ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. అంతేకాకుండా వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. నోయిడాలో మరణ విందు అని రాశారు. ఆ వీడియో చూస్తే.. కారు నడుపుతున్న యువకుడు ఏమీ కంగారు పడలేనట్లుగా ఉంది. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుందనే భయం కూడా లేనట్లుంది. తాజాగా ఓ యూట్యూబర్ ఇలానే స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డికి సొంత నియోజకవర్గంలో సమస్యలతో స్వాగతం పలికిన గ్రామస్తులు..
మరోవైపు కారుపై స్టంట్ చేస్తుండగా వెనుక నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నోయిడా పోలీసులు ఈ వీడియోపై చర్యలు తీసుకున్నారు. చలాన్ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. రూ.26,000 చలాన్ వేసినట్లు నోయిడా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ చలాన్‌లో కారు యజమాని మహేష్ పాల్‌గా గుర్తించారు. అతను ఢిల్లీ నివాసి. అయితే కారులో ఉన్న స్టంట్‌మ్యాన్ మహేశ్‌పాలా లేక మరెవరో తెలియరాలేదు. సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్న.. వారికి భారీ జరిమానా ఒక గుణపాఠంగా చెప్పవచ్చు.
नोएडा में मौत को दावत @noidatraffic @Uppolice #Noida pic.twitter.com/RlGVLWsIjK
— Nitin Parashar (@Nitinparashar__) August 16, 2023