పాము పేరు వింటేనే వణికిపోయే వారు చాలా మంది ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పాముల జాతులు ఎన్నో కనిపిస్తాయి. వాటిలో కొన్ని విషపూరితమైనవి ఉంటే.. ప్రమాదకరమైనవి కానివి కొన్ని ఉంటాయి. సాధారణంగా పాములను విషపూరితమైనవిగా పరిగణిస్తారు. అందుకే పాములంటే చాలా మంది భయపడుతు ఉంటారు. అవి ఒకవేళ కరిచినట్లైతే వాటిలో ఉన్న విషంతో మనుషులు చనిపోతారు. మరోవైపు పాములంటే అస్సలు భయపడని వారు ప్రపంచంలో కొంతమంది ఉంటారు. ఐతే ఈ వీడియోలో ఓ మహిళ పామును పట్టిన విధానం చూస్తే.. మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆ మహిళ ఎటువంటి భయం లేకుండా పామును పట్టుకున్నది చూడొచ్చు.
Child Marriages: బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలు కట్.. అధికారులపై చర్యలు
ఈ వీడియోలో ఒక మహిళ పైకి ఎక్కి సీలింగ్ చేసిన పెట్టెలో కర్రను పెట్టింది. వెంటనే లోపల ఉన్న 6-7 అడుగులు ఉన్న పాము కొద్దికొద్దిగా బయటకు వస్తూ.. ఆమే చేతికి చుట్టుకుంటుంది. అంతేకాకుండా ఆమే భయపడకుండా.. అందులో నుంచి తీసింది. సాధారణంగా పాములను పట్టుకోవడానికి స్నేక్ క్యాచర్ సహాయం తీసుకుంటారు. కానీ ఆ మహిళ భయపడకుండా పామును ఎంతో ఈజీగా పట్టేసుకుంది.
7/G Brundavan colony : రీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన మేకర్స్
ఈ వీడియోను ఆగస్ట్ 17న ట్విట్టర్‌లో (x) పోస్ట్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి దాదాపు 6 లక్షల వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా.. 4 వేల మంది వినియోగదారులు లైక్ చేశారు. 500 కంటే ఎక్కువ రీపోస్ట్‌లు వచ్చాయి. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేశారు. ఆ మహిళ చిన్నతనం నుండి ఈ పనిలో నిపుణులుగా తయారయ్యారని ఒక వినియోగదారు రాశారు. ఇది చూసి ఆశ్చర్యపోయినా ఆకట్టుకున్నారని మరొకరు వ్యాఖ్యానించారు. దేశం పేరును జురాసిక్ వరల్డ్‌గా మార్చాలి అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Just another normal day in Australiao90 pic.twitter.com/SUCNeltwdW
— Insane Reality Leaks (@InsaneRealitys) August 17, 2023