పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని.. ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు సీఎం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందినట్లుగా సమాచారం తెలుస్తోంది. సుమారు 15 మంది వరకు తీవ్ర గాయాలు అయ్యాయి.
లోకేశ్ చేపట్టిన యువగళం ఈవినింగ్ వాక్ అని విమర్శించారు. విజయవాడ నగరం గురించే మాట్లాడలేవని లోకేష్ ను ఎద్దేవా చేశారు. లోకేశ్ చేస్తున్న యాత్రకు ప్రజాదరణ లభించడం లేదని.. అందువల్లనే టీడీపీ ఎంపీలు లోకేష్ యాత్రను బహిష్కరించారని వెల్లంపల్లి తెలిపారు.
టీడీపీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు చూసి గల్లీ క్రికెట్ గెలిచి వరల్డ్ కప్ గెలిచినట్టు టీడీపీ ఫీలవుతుంది అని విమర్శించారు.
ఏపీలో పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉనికే లేని ఏపీలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి కీలకమైన సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. తెలంగాణకు ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో ఇద్దరికి చోటు కనిపించిన ఏఐసీసీ అధిష్టానం.. ఏపీకి మాత్రం సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వాన్ని రఘువీరారెడ్డికి ఇచ్చింది.
మరోవైపు మణిపూర్ మండిపొతున్నా కేంద్రం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. గుజరాత్ తరహా కుట్రలు మణిపూర్ లో అంతకు మించి చేశారని ఆరోపించారు. మణిపూర్ లో విద్వేషాలు రెచ్చ గొట్టింది బీజేపీనేనని విమర్శించారు సీపీఐ నారాయణ అన్నారు.
పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాముకాటుకు గురయ్యారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని స్వయంగా మంత్రి హర్జోత్ సింగ్.. ట్విటర్ వేదికగా వెల్లడించారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు జిల్లాల్లో రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా శనివారం సిజి వద్ద అకాజన్-లికాబాలి-ఆలో రహదారిపై కొండచరియలు విరిగిపడినట్లు ఓ అధికారి తెలిపారు.