ఐర్లాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా.. భారత్ మొదటి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ పర్యటనకు జస్ప్రిత్ బుమ్రా భారత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 14 నెలల తర్వాత బుమ్రా రీఎంటీ ఇచ్చాడు. మరోవైపు సీనియర్లు ఎవరూ లేకుండా భారత్.. ఐర్లాండ్ టూర్ లో పాల్గొంది.
Vishnu Priya : సమ్మోహనుడా సాంగ్ కు హాట్ స్టెప్స్ తో ఆకట్టుకున్న విష్ణు ప్రియ..
ఐర్లాండ్ పర్యటనకు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్.. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు. అలాగే గాయంతో ఏడాదిగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ప్రసిద్ధ్ కృష్ణ.. ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు. సంజూ శాంసన్‌కి వికెట్ కీపర్‌గా చోటు దక్కింది. అటు శివమ్ దూబే, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
Pawan Kalyan and Chandrababu: విడిగా పోటీ చేసినా.. కలిసి పోటీ చేసినా.. ఆ ఇద్దరు కలిసే ఉన్నారు..
ఇదిలా ఉంటే.. మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా తన ప్రతాపాన్ని చూపించాడు. రీ ఎంట్రీ తర్వాత అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చాడు. తన మొదటి ఓవర్లలోనే ఐర్లాండ్ రెండు వికెట్లను పడగొట్టాడు. బుమ్రా ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్లు.. నేను పాత బుమ్రానే అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఐర్లాండ్ స్కోరు 2 వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది. క్రీజులో స్టిర్లింగ్ (2), టెక్టర్ (7) ఉన్నారు. చూడాలి మరీ.. ఎంతో ఉత్సాహంతో రంగంలోకి దిగిన యువ ఆటగాళ్లు ఎలా రానిస్తారో…!