దోమల వల్ల మనుషులకు ప్రమాదమనే వియయం అందరికి తెలిసిందే. దోమలు కరిస్తే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని దోమల బారి నుంచి జనాలు దూరంగా ఉంటారు. మరోవైపు ఎలాగైనా సరే.. రక్తం తాగాల్సిందేన్నట్టు దోమలు మనుషులపై దండయాత్రకు దిగుతాయి. అంతేకాకుండా.. మన చెవిచుట్టూ తిరుగుతూ.. వాటి సౌండ్ తో ఇబ్బందికి గురిచేస్తాయి.
Read Also: Covid Variant: వెలుగులోకి కరోనా కొత్త వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో అలర్ట్
ఐతే దోమల బారినుండి రక్షించుకోవడానికి మార్కెట్లో వాటి నిర్మూలనకు ఎన్నో వస్తువులు ఉన్నాయి. దోమల బ్యాట్, క్రీములు, ఇతర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వ్యక్తికి తన కాలు మీద దోమ కుడుతుందని ఏకంగా ఓ సుత్తితో కొట్టాడు. దెబ్బకు దోమ సచ్చింది.. బొక్క ఎరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి కాలుపై దోమ కుడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే దానిని గమనించిన వ్యక్తి.. సుత్తితో కొట్టాడు. దీంతో దోమ చనిపోగా.. కాలు మీద రక్తం కనపడుతుంది. వెంటనే ఒక ఎక్స్ రే ఫోటో కనిపిస్తుంది. అందులో సుత్తితో కొట్టినందుకు వ్యక్తి కాలు ఎముక విరిగినట్లు కనిపిస్తుంది. దోమను చంపడానికి ఇలా తెలివితక్కువ పని చేసినందుకు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Errabelli Dayakar Rao: నాకు నచ్చిన నాయకులు ఇద్దరే ఒకరు ఎన్టీఆర్ ఇంకొకరు కేసీఆర్
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @qazaqsolo ద్వారా ఆగస్టు 6న పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 87 లక్షల మంది చూడగా.. 2 లక్షల 90 వేల లైక్‌లు వచ్చాయి. మరోవైపు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి మూర్ఖత్వంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు హేళన చేస్తున్నారు. మరికొందరు.. ప్రజలు ఎప్పుడూ ఏ పనిని ఆవేశంతో ఆలోచించకుండా చేయకూడదని పెద్దలు చెప్పిన పాఠాన్ని గుర్తు చేసుకున్నారు.