ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. రాష్ట్రంలో సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించి నిన్న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికల్లో వైసీపీ కొన్ని, టీడీపీ సీట్లను కైవసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్-3పై ఇస్రో కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ
ఉప ఎన్నికల ఫలితాలు చూసి గల్లీ క్రికెట్ గెలిచి వరల్డ్ కప్ గెలిచినట్టు టీడీపీ ఫీలవుతుంది అని విమర్శించారు. అసలు పంచాయతీ ఎన్నికలు స్థానిక అంశాలతో కూడినది అని.. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ గెలిచిన విషయం మరచి ఆ మీడియా ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
Read Also: Vadlamani Priya : గ్లామర్ షో తో రెచ్చకొడుతున్న ” వడ్లమాని ప్రియ”..
అప్పుడప్పుడు గెలిచే వారి ఆనందం టీడీపీలో కనిపిస్తోందని మంత్రి అమర్నాథ్ అన్నారు. పవన్ కల్యాణ్, టీడీపీల కలయిక గురించి ముందే చెప్పామని.. ఇప్పుడు పవన్ నోట ఆ కలయిక మాట వినిపించి ఉండొచ్చన్నారు. అయితే టీడీపీ వ్యవతిరేక ఓట్లు చీల్చడానికి వేరుగా పోటీ చేయడం.. టీడీపీ అనుకూల ఓట్లు చీలకుండా ఉండేందుకు కలిసి పోటీ చేయడం పవన్ కల్యాణ్ కు అలవాటు మంత్రి పేర్కొన్నారు. ఎంతమంది కలిసి పోటీ చేసిన 2024 ఎన్నికల్లో 2019 ఫలితాలు రిపీట్ ఖాయం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.