ఏపీలో పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉనికే లేని ఏపీలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి కీలకమైన సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. తెలంగాణకు ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో ఇద్దరికి చోటు కనిపించిన ఏఐసీసీ అధిష్టానం.. ఏపీకి మాత్రం సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వాన్ని రఘువీరారెడ్డికి ఇచ్చింది. వాస్తవంగా రఘువీరారెడ్డి 2018 ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యే రాయ్ పూర్ లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో రఘువీరా పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కానీ ఏపీలో మాత్రం అతను యాక్టీవ్ గా లేరు.
Read Also: Luna 25: రష్యా మూన్ మిషన్ ఫెయిల్.. చంద్రునిపై కుప్పకూలిన లూనా 25
మరోవైపు పార్టీ అంతా ఆయన రాజకీయాల నుంచి విరమించినట్టుగా భావిస్తున్న సమయంలో ఆయనకు సీడబ్ల్యుూసీలో స్థానం కల్పించడం పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ఉన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ కు మాత్రం సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం దొరకలేదు. దామోదర రాజనర్సింహ వంశీచంద్రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో స్థానం కల్పించారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజులు కూడా ఈ కోటాలోనే చేర్చారు. అలాగే టి.సుబ్బరామిరెడ్డి హైదరాబాద్ లో ఆయన నివాసం ఉంటున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
Read Also: IIT Roorkee : పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఐఐటీ రూర్కి..
తెలంగాణ నుంచి ఈసారి సీడబ్ల్యూసీలో కచ్చితంగా ఒకరికి స్థానం దొరుకుతుంది అని ఆలోచనలో ఆ రాష్ట్ర పార్టీ ఉంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీకి దూరంగా ఉంటూ సొంత పనులు చూసుకుంటున్నా రఘువీరారెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలిలో చోటు ఇవ్వడం ద్వారా ఏం ఆశిస్తుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇంతకు మునుపు తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్, టీ. సుబ్బిరామిరెడ్డి శాశ్వత సభ్యుల జాబితాలో ఉండే వారు. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు శాశ్వత ఆహ్వానితుల కోటాలో చోటు ఇచ్చారు.