RTC Bus Accident: పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. సుమారు 100 అడుగుల లోయలో పడ్డ ఘటనలో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 23 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
Read Also: Mumbai airport: కొకైన్ ను సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్.. రూ.15 కోట్ల కొకైన్ సీజ్..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని.. ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు సీఎం. అంతేకాకుండా.. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టి సారించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
Read Also: Ariyana Glory : కిర్రాక్ పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
మరోవైపు ఈ బస్సు ప్రమాదానికి కారణాలను బస్సు డ్రైవర్ భాస్కర్ రావు తెలిపాడు. ప్రమాదం జరిగే ముందు మలుపులో ఓ బైక్ వేగంగా వస్తుందని.. దానిని తప్పించే క్రమంలో పిట్టగోడను ఢీకొట్టి బస్సు లోయలో పడినట్లు చెప్పాడు. ఈ ప్రమాదం మధ్యాహ్నం 3గంటల సమయంలో జరిగిందని డ్రైవర్ తెలిపాడు. విశాఖ నుంచి పాడేరు వెళుతుందని.. ప్రమాదం జరిగే సమయంలో 25మంది ప్రయాణీకులు ఉన్నారన్నాడు. ప్రస్తుతం డ్రైవర్ కూడా తీవ్ర గాయాలు కావడంతో పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?