తాడేపల్లిలో మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మల్లాదివిష్ణు, దేవినేని అవినాష్ లు ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగా వెలంపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ లేదని ఆరోపించారు. కొడుకు పాదయాత్రకు ప్రజాదరణ లేదని తెలుసుకున్న బాబు, పవన్ కళ్యాణ్ తో వారాహి యాత్ర చేయిస్తున్నాడని విమర్శించారు. యాత్రలో భాగంగా పవన్ మాట్లాడే మాటలు ఎవరికి అర్థం కావన్నారు. పొంతన లేని మాటలు మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా.. వృద్ద తండ్రి చంద్రబాబు కూడా యాత్రలు చేస్తున్నారని విమర్శనాస్త్రాలు గుప్పించారు.
Madhyapradesh: పెంపుడు కుక్క కోసం గొడవ.. భార్యాపిల్లలను చంపేసి తానూ ఆత్మహత్య
దేవాలయాలను కూల్చేసిన చంద్రబాబు, లోకేష్, పవన్ హిందూ ద్రోహులని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ, జనసేన వాళ్లకి జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు ప్రజలు అంతా జగన్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకి లోకేష్ చేసే పాదయాత్ర పై నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లో పోటీ చెయ్యగలరా అని సవాల్ విసిరారు. ప్రజాబలం ఉంటే అన్ని స్థానాలలో పోటీ చేయండని తెలిపారు. లోకేశ్ చేపట్టిన యువగళం ఈవినింగ్ వాక్ అని విమర్శించారు. విజయవాడ నగరం గురించే మాట్లాడలేవని లోకేష్ ను ఎద్దేవా చేశారు. లోకేశ్ చేస్తున్న యాత్రకు ప్రజాదరణ లభించడం లేదని.. అందువల్లనే టీడీపీ ఎంపీలు లోకేష్ యాత్రను బహిష్కరించారని వెల్లంపల్లి తెలిపారు.
Samajavaragamana: బీకామ్ లో ఫిజిక్స్.. ఈ డీలిటెడ్ సీన్ ఉంటే థియేటర్ మారుమ్రోగిపోయేదంతే
మరోవైపు ఆర్యవైశ్యులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వెల్లంపల్లి మండిపడ్డారు. ఆర్యవైశ్యలను అన్ని రకాలుగా ఆదుకుంటుంది జగనన్నే అని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకి మేలు చేసింది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. పొట్టి శ్రీరాముల ని అవమానించింది చంద్రబాబు.. గౌరవించింది జగన్ అని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులపై మీ కపట ప్రేమలు పనికిరావని తెలిపారు. ఇక సినిమాలు, రాజకీయాలలో పవన్ కల్యాణ్ జీరో అన్నారు. సీఎం జగన్ ను ఏకవచనంతో దుషిస్తే సహించేది లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.