వచ్చే నెలలో జరిగే జీ20 సదస్సుకు ఇప్పటి నుంచే నాకా బందీ అవసరమా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు ఆంక్షలు, తనిఖీలతో ఇప్పటి నుంచే ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కొన్ని కార్యాలయాలను మూసి వేయించారని తెలిపారు. మోడీ ఛైర్మన్ అయ్యారనే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. జీ 20 లోగోలో పుష్పం పెట్టి రాజకీయంగా వాడుతున్నారని తెలిపారు. ఇవి రాజకీయ దిగుజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. మరోవైపు మణిపూర్ మండిపొతున్నా కేంద్రం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. గుజరాత్ తరహా కుట్రలు మణిపూర్ లో అంతకు మించి చేశారని ఆరోపించారు. మణిపూర్ లో విద్వేషాలు రెచ్చ గొట్టింది బీజేపీనేనని విమర్శించారు సీపీఐ నారాయణ అన్నారు.
Mahesh Babu: ఇప్పుడు కూడా చేయకపోతే సినిమా రిలీజ్ అవ్వదు బ్రో..
అక్కడ అల్లర్లకు, అరాచకాలకు బీజేపీనే కారణమని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. హైకోర్టు ద్వారా అక్కడ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇప్పించారని.. ట్రైబల్ రక్షణకు చట్టం ఎప్పటి నుంచో ఉందని ఆయన తెలిపారు. దీనిని బద్దలు కొట్టాలని బీజేపీ చేసిన ప్రయత్నమే ఈ దాడులని నారాయణ అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. విలువైన అటవి సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టాలనేదే మోడీ ఉద్దేశమని నారాయణ దుయ్యబట్టారు. పోలీసులు ఎదుటగానే మారణ హోమం జరిగిందని.. తల్లి, కుమార్తెలపై అత్యాచారం చేసి చంపేశారని ఆయన మండిపడ్డారు.
DRDO Drone Crash: పరీక్షిస్తుండగా పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్
పార్లమెంటు రేపు జరుగుతుందనగా వీడియో బయటకి వచ్చిందని సీపీఐ నారాయణ అన్నారు. మే 3న ఘటన జరిగితే ఇప్పుడు వీడియో ఇచ్చారంటే మోడీ కుట్ర అర్ధం చేసుకోండని విమర్శించారు. అంతకుముందు అమిత్ షా అక్కడ పర్యటించిన సమయంలో ఎందుకు వీడియో ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంటులో రచ్చ చేయించి తమ బిల్లులు పాస్ చేసుకోవాలనే ముందు రోజు వీడియో విడుదల చేశారని అన్నారు. మణిపూర్ లో ట్రైబల్ హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మణిపూర్ ఘటనను అడ్డం పెట్టుకుని లబ్ది పొందాలని మోడీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మత ఘర్షణలు పేరు చెప్పి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేసినా మణిపూర్ దాడులను సమర్ధించినట్లేనన్నారు. మరోవైపు అక్టోబర్ లో విపక్ష కూటమి సమావేశం అవుతుందని సీపీఐ నారాయణ తెలిపారు.