కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ ఆరోపించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం కిరణ్ రిజిజుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ పనితీరుకు సంబంధించిన 188వ నిబంధన కింద రమేష్ ఈ నోటీసు ఇచ్చారు.
పేకాట ఆడుతూ ఆరుగురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు.. పేకాట ఆడుతున్న మహిళలను పట్టుకున్నారు. వారి నుంచి 52 ప్లేయింగ్ కార్డులతో పాటు మొత్తం రూ.2,780 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ విశాఖలోని ACA–VDCA క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రాత్రి 7.30 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ.. HR టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సింగపూర్‌కు చెందిన క్రిప్టో సోషల్ నెట్‌వర్క్ 0xPPL.com వ్యవస్థాపకుడు. అతను పెట్టుబడి పెట్టిన స్టార్టప్ కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి ప్రసన్న శంకర్ నారాయణ.. ఇప్పుడు భార్య బాధితుడు అయ్యాడు.
మాజీ కేంద్ర మంత్రి, టెక్నోక్రాట్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేరళలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు భర్త. కాగా.. రెండ్రోజుల తర్వాత ఈ హత్య ఉదంతం బయట పడింది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోని శార్దుల్ ఠాకూర్‌కు అదృష్టం కలిసొచ్చింది. అతనిని రూ.2 కోట్ల డీల్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులోకి తీసుకుంది. రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్ పూల్ (RAPP) ఆప్షన్ ద్వారా శార్దూల్‌ను తీసుకున్నారు.
గుజరాత్‌కు చెందిన ఇంజనీర్ అమిత్ గుప్తాను ఖతార్‌లో అరెస్టు చేసిన విషయం వెలుగుచూసింది. ఈ అరెస్టు క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అమిత్ గుప్తా టెక్ మహీంద్రా సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.