ఇషాన్ కిషన్ అద్బుత ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక విషయాలు వెల్లడించారు. ఇషాన్ కిషన్.. ముంబై ఇండియన్స్ (MI)కు ఆడిన సమయంలో వెనుకబడిపోయాడని.. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో అతనికి కావాల్సిన స్వేచ్ఛ లభించిందని అభిప్రాయపడ్డారు.
దేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగం గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జనాలకు నమ్మకం పెరుగుతోంది. ఈ క్రమంలో.. ఎలక్ట్రిక్ వాహనాలను అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ కార్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ కార్లు ప్రతి నెలా భారీ పొదుపును అందిస్తున్నాయి. దీంతో.. జనాలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.
మీరు వోక్స్‌వ్యాగన్ వర్టస్ లేదా టిగువాన్ కొనాలని అనుకుంటున్నారా.. ఇదే మంచి అవకాశం. ఈ రెండు కార్లపై వోక్స్‌వ్యాగన్ రూ. 2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాకుండా.. కస్టమర్లకు 4 సంవత్సరాల ప్రామాణిక వారంటీ (స్టాండర్డ్ వారంటీ), పాత పోలో కార్ల యజమానులకు రూ. 50,000 ప్రత్యేక లాయల్టీ ప్రయోజనం కూడా అందిస్తోంది.
విప్రజ్ నిగమ్... నిన్నటి వరకు చాలా తక్కువ మందికి ఈ పేరు తెలుసు. అయితే.. 2025 సీజన్ ప్రారంభంలో ఈ యువ ఆటగాడు తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి క్రికెట్ ప్రేమికుడి నోట ఇతని పేరే మెదులుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో విప్రజ్ నిగమ్ తన తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ప్రదర్శించి తన ప్రతిభను చాటాడు. విప్రజ్ తన తొలి మ్యాచ్‌లో ఆల్-రౌండ్ ప్రదర్శనతో మెప్పించాడు.
మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బోరా, ఆమె భర్త దీపక్ హుడా మధ్య వివాదం మరింత పెరుగుతోంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకున్న తర్వాత ఈ వివాదం ఎక్కువైంది. భర్త దీపక్ హుడాపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి ఉందని స్వీటీ చెప్పింది. ఈ విషయం తనకు తరువాత తెలిసిందని చెప్పింది.
ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కలవడానికి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. "నేను కోహ్లీ సర్ పాదాలను తాకిన వెంటనే ఆయన నా పేరు అడిగి, 'జల్దీ సే భాగ్ జా (వేగంగా పారిపో)' అని చెప్పారు. అంతేకాకుండా.. భద్రతా సిబ్బంది నన్ను కొట్టవద్దని కూడా కోరారు" అని రీతుపర్ణో పఖిరా టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించాడు.
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టులో చోటు లభించకపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని.. కానీ జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నానని సిరాజ్ తెలిపాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఈ మ్యాచ్ అనంతరం అశుతోష్ తన ఇన్నింగ్స్‌ను గురువు శిఖర్ ధావన్‌కు అంకితం చేశాడు.
విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 209 పరుగుల భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 210 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది.