ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోని శార్దుల్ ఠాకూర్‌కు అదృష్టం కలిసొచ్చింది. అతనిని రూ.2 కోట్ల డీల్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులోకి తీసుకుంది. రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్ పూల్ (RAPP) ఆప్షన్ ద్వారా శార్దూల్‌ను తీసుకున్నారు. బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయం కారణంగా శార్దూల్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారు. మొహ్సిన్ ఖాన్ కాలి గాయం కారణంగా ఈ సీజన్ సెకండాఫ్ వరకు జట్టులో ఉండకపోవచ్చు. ప్రస్తుతం మొహ్సిన్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఈ క్రమంలో.. శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Read Also: Manoj : అమ్మాయిని చీట్ చేశావ్.. యాంకర్ మీద మనోజ్ ఫైర్
శార్దూల్ దేశీయ సీజన్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీలో బ్యాటింగ్, బాల్ రెండింటిలోనూ తన ప్రతిభను కనబరిచాడు. శార్దూల్ ఠాకూర్ ఇటీవల LSG శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు.. లక్నో జట్టులో చేరుతున్నట్లు అనుకున్నారు. లక్నో జట్టులో ప్రస్తుతం గాయాల సమస్య ఎక్కువగా ఉంది.
Read Also: NABARD: కొడితె ఇలాంటి జాబ్ కొట్టాలి.. నాబార్డ్ లో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 70 లక్షల జీతం
అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మయాంక్ యాదవ్ గాయాలతో బాధపడుతున్నారు. అవేష్, ఆకాష్ మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. మయాంక్ యాదవ్ కూడా సీజన్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ సీజన్‌లో LSG తమ మొదటి మ్యాచ్‌ను వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.