పేకాట ఆడుతూ ఆరుగురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు.. పేకాట ఆడుతున్న మహిళలను పట్టుకున్నారు. వారి నుంచి 52 ప్లేయింగ్ కార్డులతో పాటు మొత్తం రూ.2,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బరద్వరి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ్ పాండే మాట్లాడుతూ.. ఈ కేసు చాలా దిగ్భ్రాంతికరమైనదని అన్నారు. మహిళలు పేకాట ఆడుతుండం.. అది కూడా ఓ నివాస ప్రాంతంలో ఆడటం ఆశ్చర్యం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Physical Harassment : ఎంఎంటీఎస్ రైల్లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం!
పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేసి.. జూదం చట్టంలోని సెక్షన్ 13G కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన మహిళలలో బ్రజ్‌కిషోర్ అలియాస్ లంబి (సంజయ్‌నగర్), పుష్ప (కోట్వాలిలోని బస్మండి), ప్రేమ్వతి (సంజయ్‌నగర్), నాన్హి దేవి (మచ్చాలి బజార్), మీరా (మచ్చాలి బజార్), సాధన (మచ్చాలి బజార్ సమీపం) ఉన్నారు. బరద్వరి పోలీసు బృందం సంజయ్‌నగర్ జంక్షన్ వద్ద గస్తీ నిర్వహిస్తుండగా.. ఒక ఇన్‌ఫార్మర్ ద్వారా కొంతమంది మహిళలు పేకాట ఆడుతున్నారని తెలుసుకుని రైడ్ చేశారు.
Read Also: DC vs LSG: 30 మంది అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించిన ఏసీఏ
ఈ క్రమంలో ఆరుగురు మహిళలు పేకాట ఆడుతూ డబ్బు లావాదేవీలు జరుపుతున్నట్లు గుర్తించారు. పోలీసులను చూసిన ఆ మహిళలు భయపడి పారిపోయేందుకు ప్రయత్నించారు. కాగా.. మహిళలు పేకాట ఆడటం ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అరెస్టు అయిన మహిళలపై జూదం చట్టంలోని సెక్షన్ 13G కింద పోలీసులు కేసు నమోదు చేశారు.